భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక నూతన శకం ఆరంభమైంది. దశాబ్దాలుగా నార్త్ అండ్ సౌత్ అని వేరుగా చూసే సరిహద్దులను చెరిపేస్తూ, సరికొత్త బాషా సంచలనాలకు తెరలేపింది పాన్ ఇండియా కల్చర్. ఈ క్రమంలోనే ఏళ్ల తరబడి బాలీవుడ్ అగ్ర తారల గుప్పిట్లో ఉన్న నంబర్ వన్ సింహాసనాన్ని ఒక సరికొత్త రూపం కైవసం చేసుకుంది. కన్నడ నేలపై అడుగుపెట్టి, తెలుగు, హిందీ ప్రేక్షకులను తన నటనతో మంత్రముగ్ధులను చేసిన 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న(Rashmika Mandanna).. తాజాగా దేశంలోనే అత్యధిక పాప్యులారిటీ ఉన్న నెంబర్ వన్ హీరోయిన్‌గా అవతరించింది. బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతూ దిగ్గజ నాయిక దీపిక పదుకొణెను సైతం వెనక్కి నెట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ అపూర్వ విజయానికి ప్రధాన కారణం ఆమె ఎంచుకున్న పాత్రలు, బాక్సాఫీస్ వద్ద అవి సృష్టించిన సునామీ. 'పుష్ప: ది రైజ్' చిత్రంలో శ్రీవల్లిగా ఆమె చూపిన అమాయకత్వం, పక్కింటి అమ్మాయి రూపం కోట్లాది మంది మనసులను దోచుకుంది. ఆ వెంటనే వచ్చిన 'యానిమల్' సినిమాతో హిందీ ప్రేక్షకులకు మరింత చేరువై, గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ బ్యాలెన్స్‌ను అద్భుతంగా ప్రదర్శించింది. ఇక ఇటీవల విడుదలైన 'పుష్ప 2(Pushpa 2)' ఆమె క్రేజ్‌ను శిఖరాగ్రానికి చేర్చింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, 'ఛావా', 'కుబేర' వంటి వైవిధ్యమైన చిత్రాలతో అన్ని సినీ పరిశ్రమలను తనవైపు తిప్పుకునేలా చేసింది.
ప్రస్తుతం రష్మిక జోరు చూస్తుంటే ఇప్పట్లో ఆమెను టచ్ చేయడం ఎవరికీ సాధ్యం కాదనే చెప్పాలి. చేతినిండా భారీ ప్రాజెక్టులతో ఆమె డైరీ ఫుల్ అయిపోయింది. విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తో కలిసి నటిస్తున్న 'రణబాలి', 'మైసా', 'రాకా' లాంటి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. దీనికి తోడు 'పుష్ప 3', 'యానిమల్ పార్క్' వంటి సీక్వెల్స్ ఆమె రేంజ్‌ను మరింత పెంచడం ఖాయం. మొత్తానికి ఒక సాధారణ ప్రాంతీయ నటి నుంచి దేశం గర్వించదగిన పాన్ ఇండియా క్వీన్‌గా రష్మిక ఎదిగిన తీరు.. నేటి యువ నటీమణులకు ఒక రోల్ మోడల్.