జనసేన ఎమ్మెల్యేకు చంద్రబాబు క్లాస్

admin
Published by Admin — September 03, 2026 in Politics
News Image

సీఎం చంద్రబాబుకు పని రాక్షసుడు అని పేరుంది. ప్రజా సంక్షేమం కోసం ఆయన అహర్నిశలు పాటుపడుతుంటారు. అంతేకాదు, తన పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా పరుగులు పెట్టిస్తుంటారు. ఎప్పటికప్పుడు నేతల పనితీరుకు ర్యాంకులు ఇస్తుంటారు. అదే కోవలో ఇప్పుడు కూటమి పార్టీల నేతల పనితీరును విశ్లేషించిన చంద్రబాబు...నరసాపురం జ‌న‌సేన‌ ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

అన్నింటిలోనూ మైనస్ లో ఉన్నారని జ‌న‌సేన ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్‌ పై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా నాయకర్ పని చేయాలని, నరసాపురం వెనుకబడిందని చంద్రబాబు అన్నారు. అంతేకాదు, ఆ సమస్యలు తనకు చెప్పడం కాదని, అవసరమైతే ప్రజల సహకారంతో సమస్యలు పరిష్కరించాలని సూచించారు. నోడల్ అధికారిని మార్చి యాక్టివ్ గా పనిచేసే అధికారిని నియమించాలని సలహా ఇచ్చారు.

" పెర్ఫామెన్స్ బాలేదు. ఎమ్మెల్యేగారూ మీరు, మీ నియోజకవర్గ ఆఫీసర్లు సరిగా పనిచేయడం లేదు. జిల్లా బాగుంది. మీ నియోజకవర్గం సరిగా లేదు. అన్నింట్లో మైనస్ ఉన్నారు. 25 అంశాలు పాజిటివ్ ఉంటే 23 మైనస్. అక్టోబర్ నెలలో 21 పాజిటివ్ ఉంటే.. 20 మైనస్. ఇది ఆమోదయోగ్యం కాదు. ఎమ్మెల్యే గా మీరు పనిచేయాలి.. నరసాపురం వెనుకబడింది. సమస్యలు నాకు చెప్పడం కాదు.. అవసరమైతే ప్రజల సహకారంతో సమస్యలు పరిష్కరించాలి. నోడల్ అధికారిని మార్చి యాక్టివ్ గా పనిచేసేవారిని నియమించాలి" అంటూ ప్రజావేదిక నుంచి, ప్రజల ముందు చంద్రబాబు క్లాస్ తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రబాబు క్లాస్ పీకుతుంటే నాయకర్ సైలెంట్ గా ఉండిపోయారు

Tags
Cm chandrababu warns janasena mla nayakar
Recent Comments
Leave a Comment

Related News