``లోకేష్ పట్టుబడితే అంతేనబ్బా.. వెరీ హ్యాపీ!``- అనే మాట ఏపీలో వినిపిస్తోంది. త్వరలోనే మరో డీఎస్సీ వేయనున్నట్టు లోకేష్ తాజాగా ప్రకటించడం పట్ల.. ఉపాధ్యాయ వర్గాలు.. ముఖ్యంగా టీచర్ కొలువులు ఆశిస్తున్న నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో మెగా డీఎస్సీ వేస్తామని హామీ ఇచ్చి.. ఒక్క సారి కూడా డీఎస్సీ వేయకుండానే చేతులు దులుపుకొన్న నేపథ్యంలో ఇప్పుడు కూటమి సర్కారు వరుసగా డీఎస్సీలు ప్రకటించడం.. మంత్రి లోకేష్ సైతం.. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగడం వంటివి నిరుద్యోగుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి.
తాజాగా మరోసారి లోకేష్ కీలక ప్రకటన చేశారు. 2029 అంటే.. కూటమి సర్కారు ఐదేళ్ల పాలన పూర్తయ్యే సరికి మరో 3 డీఎస్సీ లను నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఏడాది నుంచి వరుసగా మూడేళ్లపాటు ప్రతి సంవత్సరం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని హామీఇచ్చారు. ఈ హామీ విషయంపై ఉపాధ్యాయ, నిరుద్యోగ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులను సాంకేతికంగా తీర్చిదిద్దుతున్న తీరును అభినందిస్తున్నారు. ఇటీవల కొందరు సెలక్టెడ్ టీచర్లను విదేశాలకు తీసుకువెళ్లి.. అక్కడి విద్యా బోధన, పాఠశాలల తీరుపై తర్పీదు ఇచ్చారు.
ఏపీలోనూ అదే తరహా వాతావరణంలో విద్యాబోధన చేయాలన్నది లోకేస్ పట్టుదల. ఆయన పట్టుదల పడితే..సాకారం చేసుకో కుండా ఉండరన్నది ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట. ఇక, ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా..16 వేల కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడం.. ఇప్పుడు దసరా నాటికీ ఈ ఏడాది మరో డీఎస్సీ వేయనున్న నేపథ్యంలో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నా రు.. అందుకే.. లోకేష్ పట్టుబడితే అంతే నబ్బా.. అనే మాట వినిపించేలా చేసింది.
ఆది నుంచి కూడా..
టీడీపీ హయాంలో డీఎస్సీలను ప్రవేశ పెట్టిన ఘటన సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. ఇప్పటి వరకు అంటే.. 30 ఏళ్ల లో 2 లక్ష ల 30 వేల మంది టీచర్లను భర్తీ చేశారు. అలాగే.. ఉపాధ్యాయులను కేవలం గురువులుగానే పరిగణించకుండా.. ఏటా అవార్డుల తో సత్కరించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం 117 జీవో తెచ్చి పిల్లలను పాఠశాలలకు దూరం చేసింది. దీంతో తాజాగా కూటమి ప్రభుత్వం దీనిని రద్దు చేసి.. ఉపాధ్యాయులకు మేలు చేసేలా చేసింది. మొత్తంగా నాడు చంద్రబాబు.. నేడు మంత్రి లోకేష్ ఉపాధ్యాయుల విషయంలో సానుకూలంగా ఉండడం గమనార్హం.