రిలీజ్‌కు ముందే ఊచకోత.. ది ప్యారడైజ్ న‌యా రికార్డ్‌.!

admin
Published by Admin — September 09, 2026 in Movies
News Image

నేచురల్ స్టార్ నాని(Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రగడ సృష్టిస్తోంది. థియేటర్లలోకి అడుగుపెట్టడానికి ముందే, ముందస్తు బుకింగ్స్‌లోనే తన అడ్డాను ఫిక్స్ చేసుకుంది. ముఖ్యంగా విదేశీ మార్కెట్‌లో ఈ చిత్రం చూపిస్తున్న ప్రతాపం చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఓవర్సీస్‌లో 'ప్యారడైజ్' సంచలనం
ఉత్తర అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే లక్ష డాలర్ల మార్కును దాటేసి 'ది ప్యారడైజ్(The Paradise)' సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న తెలుగు చిత్రంగా నిలిచింది. కేవలం ప్రముఖ బుకింగ్ ప్లాట్‌ఫామ్ 'సినీమార్క్' నుంచే ఈ స్థాయి వసూళ్లు రావడం విశేషం. సెప్టెంబర్ 23న ఓవర్సీస్ ప్రీమియర్స్‌తో, సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రారంభం కానున్న ది ప్యార‌డైజ్ జ‌ర్నీ విడుదల తేదీ దగ్గర పడేకొద్దీ మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఈ చిత్రంలో నాని ‘జడల్’ అనే సరికొత్త ఊరమాస్ అవతారంలో కనిపించనున్నారు. కథాకథనాలు ఒకెత్తయితే, ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఏషనాగుల(Yeshanagula)’ పాట యూట్యూబ్‌లో రికార్డుల సునామీ సృష్టించింది. విడుదలైన కేవలం 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ సాధించిన తొలి తెలుగు పాటగా చరిత్రకెక్కింది. అలాగే 10 రోజుల్లో ఏకంగా 76 మిలియన్ల వ్యూస్ దాటేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మ‌రి ప్రీ-సేల్స్ నుంచి మ్యూజిక్ ఛార్ట్‌బస్టర్స్ వరకు ప్రతి విషయంలోనూ దుమ్ము దులుపుతున్న‌ ‘ది ప్యారడైజ్’, బిగ్ స్క్రీన్ పై ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Tags
The Paradise Nani Natural Star Nani Srikanth Odela USA Anirudh Ravichander Yeshanagula Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News