లోకల్ వార్ కు ముందు బొత్సకు బిగ్ షాక్!

admin
Published by Admin — September 09, 2026 in Politics
News Image

వైసీపీకి దెబ్బ‌ల‌పై దెబ్బ‌లు తుగులుతున్నాయి. ఒక‌వైపు మాజీ నాయ‌కుడు వి. విజ‌య‌సాయిరెడ్డి ఎప్పుడు ఎలాంటి బాంబు పేలుస్తారోన‌న్న బెంగ వైసీపీ నాయ‌కుల‌ను వేధిస్తోంది. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన కీల‌క నాయ‌కుడు వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తు న్నాడంటూ.. ఇటీవ‌ల సాయిరెడ్డి చెప్పిన‌ట్టే.. తాజాగా జ‌రిగింది. ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీకి వెన్నెముక‌గా ఉన్న బొత్స స‌త్య‌నారా య‌ణ మేన‌ల్లుడు.. బొత్స‌కు రైట్ హ్యాండ్‌గా కూడా పేరున్న మ‌జ్జి శ్రీనివాస్ ఉర‌ఫ్ చిన్న‌శ్రీను.. వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి సైతం రాజీనామా చేశారు. దీంతో పాటు పార్టీలో త‌న‌కు ఇచ్చిన అన్ని బాధ్య‌త‌ల‌ను కూడా వ‌దులుకు న్నారు.

ప్ర‌స్తుతం మ‌జ్జి శ్రీనివాస‌రావు.. విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతేకాదు.. విజయనగరం జిల్లా ప‌రిష‌త్‌(జడ్పీ) ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. అదేవిధంగా ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని భీమిలి నియోజ క‌వ‌ర్గం ఇంచార్జ్ గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భీమిలి నుంచి వైసీపీ త‌ర‌ఫున ఆయ‌న పోటీ చేసే అవ‌కాశం కూడా ఉంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే.. అక‌స్మాత్తుగా ఆయ‌న వైసీపీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం.. పార్టీ ప‌ద‌వు ల‌కు కూడా రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

బొత్స సామ్రాజ్యానికి.. చిన్న శ్రీను... క‌ళ్లు-చెవులు అన్న‌ట్టుగా ప‌నిచేశార‌నే టాక్ విజ‌య‌న‌గ‌రం స‌హా ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో జోరు గా వినిపించేది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బొత్స కుటుంబం చేసిన లిక్క‌ర్ బిజినెస్‌ను చిన్న శ్రీను ద‌గ్గ‌రుండి చూసుకునేవారు. అన్నీ వ్య‌వ‌హారాలు ఆయ‌నే చ‌క్క‌బెట్టేవారు. ఇక‌, వైసీపీ హ‌యాంలోనూ.. చిన్న‌శ్రీను విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చెల‌రేగిపోయా ర‌న్న వాద‌న కూడా ఉంది. అందుకే.. ఉత్త‌రాంధ్ర‌కు అప్ప‌ట్లో సాయిరెడ్డి ఇంచార్జ్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. విజ‌య‌న‌గ‌రం విష‌యంలో చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించాల‌ని పార్టీ ఆయ‌న‌ను కంట్రోల్ చేసింది.

టీడీపీలో చేరిక‌

ప్ర‌స్తుతం వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన చిన్న శ్రీను.. సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరారు. ఉత్త‌రాంధ్ర‌లో తూర్పు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన చిన్న శ్రీను.. స్థానికంగా బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదిగారు. ముఖ్యంగా బొత్స అధికారాన్ని ఆయ‌న అడ్డు పెట్టుకుని ఎదిగార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం.. దీనికితోడు.. తూర్పు కాపు సామాజిక వ‌ర్గంలోనూ ఆయ‌న‌కు ప‌ర‌ప‌తి మెండుగానే ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న టీడీపీలో చేర‌డం గ‌మ‌నార్హం. సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పి.. చిన్న‌శ్రీనును ఆహ్వానించారు.

Tags
Big shock to botsa ahead of local body elections
Recent Comments
Leave a Comment

Related News