22ఏ భూములపై రేవంత్ గుడ్ న్యూస్

admin
Published by Admin — September 25, 2026 in Telangana
News Image
తెలంగాణలో రాజ‌కీయ చ‌ర్చ‌కు, ర‌చ్చ‌కు దారి తీసిన 22ఏ భూముల విషయంపై రేవంత్ రెడ్డి స‌ర్కారు కీల‌క నిర్ణ యం తీసుకుంది. 22ఏ ప‌రిధిలో ఉన్న‌ప్ప‌టికీ.. అధికారులు, రెవెన్యూ శాఖ‌కు ఎలాంటి ఇబ్బంది లేక‌పోతే.. వాటిని రిజిస్ట్రేష‌న్ చేసుకునేలా తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ముఖ్యంగా రంగారెడ్డి, హైద‌రాబాద్ ప‌రిధిలోని భూముల కు ఈ ఉత్త‌ర్వులు త‌క్ష‌ణ‌మే వ‌ర్తిస్తాయ‌ని పేర్కొంది. దీని ప్ర‌కారం.. ఆయా జిల్లాల్లోని 22ఏ భూముల‌ను రిజిస్ట్రేష‌న్ చేయాల‌ని అధికారుల‌ను కూడా ఆదేశించింది.
 
ఏంటీ వివాదం?
 
22ఏ-అనేది రిజిస్ట్రేష‌న్ శాఖ‌కు చెందిన కీల‌క నిబంధ‌న‌. ప్ర‌భుత్వం కొన్ని వ‌ర్గాల‌కు అసైన్ చేసిన భూముల‌ను నిర్దిష్ట అవ‌స‌రాల‌కు మాత్ర‌మే వినియోగించుకోవాలి. వాటిని మించి వినియోగించ‌డానికి వీల్లేదు. ఇలా.. ఉన్న భూముల‌ను ప్ర‌భుత్వం నిర్దేశిస్తే.. త‌ప్ప ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌కు వినియోగించుకునే అవ‌కాశం లేదు. దీంతో 22ఏ నిబంధ‌న కీల‌కంగా మారింది.అయితే.. గతంలో కేసీఆర్ హయాంలో నిర్వ‌హించిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ స‌మ‌యంలో అనేక భూముల‌ను 22ఏ కింద చేర్చారు. దీంతో ఇది వివాదంగా మారింది.
 
నిర్దేశిత భూముల‌ను కాకుండా.. ఊహాజ‌నితంగా కొన్ని భూముల‌ను 22ఏ కింద ప‌రిగ‌ణించ‌డంతో ఆయా భూముల య‌జ‌మానులు తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. ఇది.. ప్ర‌స్తుతం రాజ‌కీయ వివాదంగాకూడా మారింది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల అసెంబ్లీలోనూ దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. సుమారు వెయ్యి ఎక‌రాల‌కు పైగా భూమి 22ఏ కింద చేర్చార‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీనిని ర‌ద్దు చేసేలా క‌మిటీని కూడా నియ‌మించింది. ఈ క‌మిటీ ఒక‌వైపు విచార‌ణ చేస్తున్న స‌మ‌యంలో తాజాగా స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.
 
దీని ప్ర‌కారం.. 22ఏ ప‌రిదిలో ఉన్న‌ప్ప‌టికీ.. స‌ద‌రు భూముల విష‌యంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌, హైద‌రాబాద్ మెట్రోడెవ‌ల‌ప్‌మెంటు కార్పొరేష‌న్‌, టౌన్ ప్లాన్ అథారిటీ సంస్థ‌లు ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌క‌పోతే.. ఆయా భూముల‌ను సంబంధిత య‌జమానులు రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. అలానే.. ఆయా భూముల‌పై సొంత హ‌క్కులు పొందేందుకు కూడా అవ‌కాశం క‌ల్పించింది. దీంతో మెజారిటీ ప్ర‌జ‌ల‌కు ఊర‌ట ల‌భించ‌నుంది. మిగిలిన భూముల విష‌యంపై ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ అధ్య‌య‌నంచేసి నిర్ణ‌యం తీసుకోనుంది.
Tags
22a lands cm revanth reddy good news for few
Recent Comments
Leave a Comment

Related News