తన కూతురు సుష్మిత చేసిన కామెంట్లను ఖండించకుండా వాటితో తనకు సంబంధం లేదు అని మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పడంతో ఆ వివాదం మరింత ముదిరింది. దీంతో, చివరకు సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సి వచ్చింది. అయితే, ఆ ఎపిసోడ్ తర్వాత కూడా కొండా సురేఖ మారినట్లు కనిపించడం లేదు.
తాజాగా తన మార్క్ డైలాగులతో తన రాజకీయ ప్రత్యర్థులకు సురేఖ డెడ్లీ వార్నింగ్ ఇచ్చిన వైనం హాట్ టాపిక్ గా మారింది. నోరు అదుపులో పెట్టుకోకుంటే మహిళలతో కొట్టిస్తానంటూ తన ప్రత్యర్థులకు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు సురేఖ. ఇష్టానుసారం మాట్లాడితే మహిళలతో చిత్తుచిత్తుగా కొట్టిస్తామని, ఒక్కో మహిళ నలుగురిని కొడుతుంది జాగ్రత్త అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష నేతలు గాలిలో కత్తులు తిప్పుతున్నారంటూ సురేఖ మండిపడ్డారు. ఇక, కొందరు నేతలు తమ హద్దులు మీరుతున్నారని, అలాంటి వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఇక, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలపై కూడా సురేఖ స్పందించారు. కాంగ్రెస్ నేతలంతా విభేదాలను వీడి పార్టీ బలోపేతం కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులంతా ఐక్యంగా ఉంటేనే పార్టీ ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు.