జ‌గ‌న్ నియంత‌: మాజీ ఎమ్మెల్యే ఫైర్‌

admin
Published by Admin — October 03, 2026 in Andhra
News Image

వైసీపీ మాజీ ఎమ్మెల్యే, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు బంధువు.. బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్ నియంత అని.. ఆయ‌న‌ను న‌మ్ముకున్న‌వంద‌ల మంది కుటుంబాలు కూలిపోయాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. పార్టీ నుంచి త‌న‌ను స‌స్పెండ్ చేయ‌డం కాద‌ని.. పార్టీనే లేకుండా పోయే ప‌రిస్తితి వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. ``వైసీపీ అనేది పార్టీకాదు. అది ఒక లిమిటెడ్ కంపెనీ. పార్టీలో క‌నీస గౌర‌వం, మ‌ర్యాద కూడా లేదు. అలాంటి పార్టీలో ఎవ‌రూ ఉండ‌రు.`` అని బ‌డ్డుకొండ అన్నారు.

బొత్స‌ను కూడా..

ఇటీవ‌ల పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన మ‌జ్జి శ్రీనివాస‌రావుకు తాను బావ‌ను కాబ‌ట్టే.. త‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశార‌ని బ‌డ్డు కొండ అన్నారు. అయితే.. మ‌జ్జి శ్రీనివాస‌రావు.. సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు కూడా బావేన‌ని.. కాబ‌ట్టి బొత్స‌ను కూడా స‌స్పెండ్ చేస్తారా? అని ప్ర‌శ్నించారు. తన‌ను స‌స్పెండ్ చేయ‌డం కాద‌ని.. తానే పార్టీకి రాజీనామా చేస్తున్నాన‌ని చెప్పారు. త‌న రాజీనామా ప‌త్రాన్ని మీడియాకు ఆయ‌న చూపించారు. ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌ని ప‌ని చేసినందుకే వైసీపీని ఓడించార‌ని అన్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ వైసీపీ ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌ని బ‌డ్డుకొండ వ్యాఖ్యానించారు. వైసీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం అంటూ ఉందా? అని నిల‌దీశారు. జ‌గ‌న్‌కు న‌చ్చిన‌ట్టు చేయాలంటే..అ న్నీ వ‌దులుకోవాల‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉన్న వైసీపీ.. భ‌విష్య‌త్తులో గెలిచే ప‌రిస్థితి కూడా లేద‌న్నారు. జ‌గ‌న్ ఒక్క‌సారి ప్ర‌జ‌లు ఏమ‌ను కుంటున్నారో తెలుసుకోవాల‌ని వ్యాఖ్యానించారు. ఇప్పుడే కాదు.. వైసీపీకి భ‌విష్య‌త్తులోనూ ప్ర‌జ‌లు ఓటేయ‌ర‌ని తేల్చి చెప్పారు.

ఎవ‌రీ బ‌డ్డుకొండ‌?

బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు.. విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు బంధువు. నెల్లిమ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో విజ‌యం కూడా ద‌క్కించుకున్నారు. ఇటీవ‌ల కాలంలో వైసీపీలో పెరుగుతున్న వ‌ర్గ‌పోరుకు ఆయ‌న దూరంగా ఉంటున్నారు. త్వ‌ర‌లోనే టీడీపీలో చేరేందుకు ఆయ‌న రెడీ అవుతున్న నేప‌థ్యంలో తాజాగా శ‌నివారం వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది.

Tags
Jagan tyrant says ex mla botsa Satyanarayana relative to botsa
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News