ఇట్స్ అఫీషియ‌ల్‌: తరుణ్‌ భాస్కర్‌కు ఈషా ఉంది

admin
Published by Admin — November 18, 2026 in Movies
News Image

టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్(Tharun Bhascker) వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చేసింది. గత కొంతకాలంగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న రూమర్స్‌కు ఆయన తల్లే స్వయంగా తెరదించారు. 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గీతా భాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

తరుణ్ భాస్కర్ కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ, నటుడిగానూ బిజీగా ఉన్నప్పటికీ.. గడచిన రెండేళ్లు ఆయనకు వ్యక్తిగతంగా చాలా కష్టకాలంగా గడిచాయని గీతా భాస్కర్(Geetha Bhascker)  వెల్లడించారు. కోర్టు కేసులు, కొత్త ఇల్లు నిర్మాణం వంటి పనులతో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నార చెప్పారు. రాత్రి పూట ఇంటికి రాకుండా షూటింగ్స్, పనులతో బిజీగా ఉండే తరుణ్‌కు ఆ సమయంలో తోడుగా నిలిచింది ఎవరో కాదంటూ ఆమె అసలు విషయం బయటపెట్టారు.

ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్లలో నిజముందని చెబుతూ, ఆ అమ్మాయి మరెవరో కాదని.. అందరూ అనుకుంటున్న ఈషానేనని(Eesha Rebba) ఆమె స్పష్టం చేశారు. కేవలం మంచి స్నేహితురాలు మాత్రమే కాకుండా, తరుణ్‌కి అన్నివేళలా అండగా నిలిచే అసలైన సోల్‌మేట్ ఈషానే అని గీతా భాస్కర్ ప్రకటించారు. ఆమె రాకతోనే తరుణ్ తన జీవితంలోని ఒడుదొడుకులను తట్టుకుని ఈ సినిమాను విజయవంతంగా పూర్తి చేయగలిగాడని అన్నారు. మొత్తానికి తరుణ్ భాస్కర్ లైఫ్‌లో ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరనే దానిపై కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన వచ్చేయడంతో, త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Tags
Tharun Bhascker Eesha Rebba Geetha Bhascker Tollywood Telugu Cinema Celebrity Couples
Recent Comments
Leave a Comment

Related News