సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి మధ్య ఎలాంటి రూమర్స్ వస్తాయో ఎవరూ ఊహించలేరు. ఒక చిన్న క్లూ దొరికితే చాలు, నెటిజన్లు దాన్ని పెద్ద రచ్చ చేస్తారు. ఇప్పుడు టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు హాట్ టాపిక్‌గా మారిన అలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాటరే మ్యూజిక్ రాక్షసన్ దేవిశ్రీ ప్రసాద్ (DSP), టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh)ల ఎయిర్పోర్ట్ మీటింగ్.
ఎనర్జిటిక్ సాంగ్స్‌తో కుర్రకారును ఊపేసే దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad).. ఇప్పుడు తన రూట్ మార్చేస్తున్నారు. కేవలం మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా, 'ఎల్లమ్మ' సినిమాతో ఏకంగా హీరోగా మాస్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో సౌత్ ఇండియాని చుట్టేస్తోంది ఐశ్వర్య రాజేష్. తెలుగులోనూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు సడన్‌గా DSPతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా కంట చిక్కడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా అనేక రూమర్లకు తెర లేపింది.
ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో నెటిజన్ల మైండ్స్ బాక్సులు బద్దలవుతున్నాయి. "అసలు వీళ్ల మధ్య ఏం నడుస్తోంది?", "ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్తున్నారా?" అంటూ రకరకాల డిస్కర్షన్లు జరుగుతున్నాయి. అయితే ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా? లేక దీని వెనుక ఏదైనా పెద్ద స్ట్రాటజీ ఉందా అనే దానిపై ఫిలింనగర్లో గట్టిగానే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం దేవిశ్రీ హీరోగా తెరకెక్కుతున్న 'ఎల్లమ్మ(Yellamma)' మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సరిగ్గా ఈ టైమ్‌లో ఐశ్వర్య రాజేష్‌తో DSP మీట్ అవ్వడం చూస్తుంటే.. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ఈ బ్యూటీని ఫైనల్ చేశారా? లేక ప్రాజెక్ట్ డిస్కషన్స్ కోసమే వీరు ఇలా సీక్రెట్‌గా కలిశారా? అనే డౌట్స్ బలపడుతున్నాయి. ఏది ఏమైనా.. రాక్ స్టార్ హీరోగా మారుతున్న చిత్రంలో ఈ టాలెంటెడ్ హీరోయిన్ నటిస్తే మాత్రం కాంబినేషన్ అదిరిపోవడం గ్యారెంటీ. ఈ వైరల్ మీటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఏంటనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తేనే తెలుస్తుంది. అప్పటివరకు ఈ క్రేజీ జోడీపై రూమర్స్ మాత్రం ఆగవనే చెప్పాలి.