వైఎస్సార్ కుటుంబం(YSR Family)లో రాజకీయ విభేదాలు, ఆస్తుల రగడ తారాస్థాయికి చేరింది. రక్త సంబంధాలు, ఆప్యాయతల కంటే ఆస్తులే ముఖ్యమన్నట్లుగా సాగుతున్న పరిణామాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా వైఎస్ షర్మిల కుమార్తె వివాహ వేడుక విషయంలో అన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరించిన తీరు కుటుంబంలో అగ్గి రాజేసింది. సొంత చెల్లెలి బిడ్డ పెళ్లికి వేదికగా మారాల్సిన బంధం.. ఇప్పుడు ఈగోల ఘర్షణకు కేంద్ర బిందువుగా మారిందని ఇన్‌సైడ్ టాక్.
షర్మిల కుమార్తె వివాహాన్ని బెంగళూరులోని యలహంక ప్యాలెస్(Yelahanka Palace)లో ఘనంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు ఎప్పట్నుంచో ప్లాన్ చేశారు. నవంబర్ 25న జరగాల్సిన ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే అతిథులందరికీ యలహంక అడ్రస్‌తోనే ఆహ్వాన పత్రికలు కూడా వెళ్లాయి. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులను స్వయంగా కలిసి ముహూర్త పత్రికలు అందజేశారు. ఇదంతా సజావుగా సాగుతున్న తరుణంలో.. అసలు మ్యాటర్ తెరపైకి వచ్చింది.
యలహంక ప్యాలెస్ తమ ఉమ్మడి ఆస్తుల్లో భాగమని, దాన్ని శుభకార్యానికి వినియోగించుకోవడానికి జగన్ అంగీకరించడం లేదనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఒకవేళ పెళ్లి వేడుకకు ఆ ప్యాలెస్‌ను ఇస్తే, భవిష్యత్తులో అది ఆస్తి హక్కుల క్లెయిమ్‌కు దారితీస్తుందనే లీగల్ టెన్షనే జగన్ ఈ కఠిన నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. తల్లి విజయమ్మ సమక్షంలోనే ఈ విషయం తేలిపోవడంతో.. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకుని పెళ్లి ఏర్పాట్లలో ఉన్న షర్మిల(YS Sharmila)కు ఇది ఊహించని షాక్‌గా మారింది.
ఒకప్పుడు తన రాజకీయ ప్రయాణంలో అండగా నిలిచి, రోడ్లపై వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చెల్లెలు షర్మిల పట్ల జగన్(Jagan) ఇంతలా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యూహమవుతున్నాయి. కనీసం ఇంట్లోని ఆడపడుచు బిడ్డ పెళ్లి విషయంలో కూడా మనసు మార్చుకోకపోవడం వైఎస్సార్ అభిమానులను, సొంత వర్గాలను కూడా తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. బంధాలు, అనుబంధాల కంటే ఆస్తులే మిన్న అనేలా జగన్ తీరు ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, పెళ్లి వేదిక మార్పు వార్తతో వైఎస్ కుటుంబంలోని మనస్పర్థలు మరోసారి రోడ్డున పడ్డట్టయింది.