‘ప్రేమలు’ సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మమిత బైజు(Mamitha Baiju) గురించి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. వరుస హిట్లు, కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన నిజం తాజాగా బయటపడింది. అసలు ఆమె పేరు మొదట్లో ‘మమిత’ కాదట. మరి ఆ పేరు ఎలా మారింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటో ఇప్పుడు చూద్దాం.
మమిత చిన్నతనంలో ఆమె పేరెంట్స్ పెట్టిన ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసా..? ‘నమిత(Namitha)’. అవును మీరు విన్నది నిజమే. కానీ, ఆమె బర్త్ సర్టిఫికెట్ నమోదు చేసే సమయంలో ఒక పొరపాటు జరిగింది. ఆ అక్షరాల తప్పు వల్ల ‘నమిత’ కాస్తా ‘మమిత’గా మారిపోయింది. విశేషం ఏంటంటే, ఈ మిస్టేక్ జరిగిందనే విషయం నమిత ఇంట్లోని వాళ్లకు కూడా నాలుగైదు సంవత్సరాల వరకు అసలు తెలియనే లేదు.
నమితను స్కూల్లో జాయిన్ చేయడానికి అఫీషియల్ సర్టిఫికెట్స్ అన్నీ చెక్ చేస్తున్న సమయంలో ఈ తప్పు అందరి కంట పడింది. అప్పటికే ఐదేళ్లు గడిచిపోవడంతో పాటు, అధికారిక పత్రాలన్నింటిలోనూ అదే పేరు ఫిక్స్ అయిపోవడంతో మార్చడం కుదరలేదు. అలా కేవలం ఒక క్లరికల్ మిస్టేక్ వల్ల నమిత పేరు శాశ్వతంగా ‘మమిత’గా మారిపోయింది. అలా ఒక పొరపాటుతో మొదలైన ఆ పేరుతోనే ఆమె ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం కోట్లలో పారితోషికం అందుకుంటూ, వరుసగా 200 కోట్ల క్లబ్ సినిమాల్లో నటిస్తూ సెన్సేషన్ సృష్టిస్తోంది. త్వరలోనే ఆమె స్ట్రైట్ తెలుగు చిత్రంలోనూ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో టాలీవుడ్(Tollywood) ప్రేక్షకుల్లోనూ ఆమెపై భారీ అంచనాలు నెలకొన్నాయి.