ఏపీ పురపోరు..కూటమి దూకుడుకి వార్ వ‌న్‌సైడ్‌.!

admin
Published by Admin — November 03, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల(AP Municipal Elections) కౌంటింగ్ ప్రక్రియ జోరుగా కొనాగుతోంది. ఉదయం నుంచి ఎక్కడ చూసినా  కూటమి హవానే కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లెక్కింపు కేంద్రాల వద్ద ఉత్కంఠ నడుమ వెలువడుతున్న ఫలితాలు ప్రత్యర్థులకు దిగ్భ్రాంతి కలిగిస్తుంటే, అధికార కూటమి శ్రేణుల్లో మాత్రం పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రెండు మూడు సున్నితమైన ప్రాంతాలను మినహాయిస్తే, మిగిలిన ప్రతీ చోటా కౌంటింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.

ఇక ఓట్ల లెక్కింపు ట్రెండ్స్ చూస్తుంటే మాత్రం పవనాలు ఏ వైపు వీస్తున్నాయో స్పష్టంగా అర్థమవుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ల(Municipal Corporation) పోరులో కూటమి ఏకపక్షంగా స్థానాలను కైవసం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. లెక్కలోకి తీసుకున్న కార్పొరేషన్లలో ప్రతీ ఒక్కచోటా కూటమే స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ ప్రత్యర్థులకు కనీస అవకాశం కూడా ఇవ్వడం లేదు. మరోవైపు, మున్సిపాలిటీల బరిలోనూ ఇదే జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పలు చోట్ల ఘన విజయం నమోదు చేసిన కూటమి, మరికొన్ని ప్రాంతాల్లో తిరుగులేని లీడ్‌తో విజయతీరాలకు చేరువవుతోంది.

ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా బరిలో నిలిచిన వైసీపీ(YCP) ప్రభావం మాత్రం ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా నామమాత్రపు స్థానిక ప్రభావానికే ఆ పార్టీ పరిమితం కావలసి వస్తోంది. కొన్ని చోట్ల మాత్రమే అతి కష్టం మీద ఆధిక్యం సాధించినా, కూటమి సునామీ ముందు ఆ లీడ్స్ నిలబడలేకపోతున్నాయి. ఇతరుల పరిస్థితి కూడా అలాగే తయారైంది. మొత్తానికి, ఏపీ పురపాలక పీఠాలపై కూటమి జెండా పాతడం ఖాయమని ప్రస్తుత ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏకపక్ష విజయాల జోరు చూస్తుంటే, రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

కాగా, ఇప్పటి వరకు అందిన ట్రెండ్స్ ప్రకారం.. మున్సిపల్ కార్పొరేషన్లలో మొత్తం 13 స్థానాలకు గాను 10 స్థానాల్లో కూటమే ఆధిక్యంలో కొనసాగుతుండగా, వైసీపీ మరియు ఇతరులు ఖాతా తెరవలేదు. ఇక 87 మున్సిపాలిటీలకు గాను 71 స్థానాల ఫలితాలు/ట్రెండ్స్ అందగా.. కూటమి(NDA) ఏకంగా 20 చోట్ల విజయం సాధించి, మరో 44 చోట్ల ఆధిక్యంలో దూసుకెళ్తోంది. వైసీపీ 5 స్థానాల్లోనూ, ఇతరులు 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

Tags
AP Municipal Elections 2026 AP Local Body Polls AP Municipal Results Andhra Pradesh AP News
Recent Comments
Leave a Comment

Related News