జడ్పిటిసి ఎన్నికల్లో మాజీ ఎంపీ ఓటమి!

admin
Published by Admin — November 10, 2026 in Politics
News Image

కాలం క‌లిసి రాక‌పోవ‌డ‌మా.. లేక న‌మ్ముకున్న కేడ‌ర్ హ్యాండివ్వ‌డ‌మా.. ఇవ‌న్నీ కాక ప్ర‌జ‌లే తిర‌స్క‌రించ‌డ‌మా? ఏది ఏమైనా.. అర‌కు మాజీ ఎంపీ గొట్టేటి మాధ‌వి ప‌రిస్థితి దారుణంగా మారింది. ఎందుకంటే.. 2019లో ఇదే పార్ల‌మెంటు ప‌రిధిలో ఆమె అప్ర‌తిహ‌త విజ‌యం న‌మోదు చేశారు. అతి పెద్ద పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంగా పేరున్న అర‌కులో అప్ప‌ట్లో తొలిసారి గెలుపు గుర్రం ఎక్కారు మాధ‌వి. అలాంటి బ‌ల‌మైన మాజీ ఎంపీ.. తాజాగా ఒక మండ‌ల‌స్థాయిలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డి ప‌రాజ‌యం పాల‌య్యారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు జడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి ఓటమి పాలయ్యారు. ఆమెపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఎం. హిమబిందు 978 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నిజానికి ఇలా జ‌రుగుతుంద‌ని మాధ‌వి అస్స‌లు ఊహించ‌లేదు. ఎందుకంటే.. త‌న సొంత పార్ల‌మెంటు స్థానం.. పైగా తానువేయించిన ర‌హ‌దారులు కంటిముందు క‌నిపిస్తున్నాయి.

తాను క‌ట్టించిన ఒక‌టి రెండు పాఠ‌శాల‌లు కూడా ఉన్నాయి. ప్ర‌జ‌ల‌తో సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి. దీంతో ఇది పెద్ద ఎన్నికే కాద‌ని.. జ‌స్ట్ రెండున్న‌రేళ్ల‌పాటు(వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల వ‌ర‌కు) ఏల‌వ‌చ్చ‌ని భావించారు. కానీ.. విధి బ‌లీయ‌మైంది. కూటమి బలమైన ప్రభావంతో మాధ‌వి చిన్న ఎన్నిక‌లోనే పెద్ద ఎదురు దెబ్బ‌తిన్నారు. ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాలపై కూట‌మి చూపించిన ప్ర‌భావం ముందు ఆమె సీనియారిటీ, సిన్సియారిటీ కూడా క‌లిసిరాలేదు. ఈ రాజకీయ పవనాలు స్థానికంగా మాధ‌వి ఓటు బ్యాంకును ప‌టాపంచ‌లు చేశాయి.

టీడీపీ అభ్యర్థి హిమబిందును మాధ‌వి త‌క్కువ‌గా అంచ‌నా వేశారు. ఆమె తొలిసారి అరంగేట్రం చేయ‌డం.. తాను సీనియ‌ర్ కావ‌డంతో పెద్ద‌గా లెక్క‌లోకి తీసుకోలేద‌న్న వాద‌న ఉంది. అయితే.. హిమ‌బిందు ఇదే ప్రాంత మాజీ ఎమ్మెల్యే కుమార్తె కావడం, స్థానికంగా ఆ కుటుంబానికి ఉన్న పట్టు, సామాజిక సమీకరణాలు మాధవికి గట్టి పోటీని ఇచ్చాయి. దీంతోపాటు గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీపై, స్థానిక సమస్యల పరిష్కారంపై ఓటర్లలో ఉన్న కొంత అసంతృప్తిని ఆమె ప‌సిగ‌ట్టలేక పోయార‌ని స‌మాచారం. ఇదే ఓట్ల రూపంలో వ్యతిరేకతగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags
Ex MP goddeti madhavi Lost Zptc elections
Recent Comments
Leave a Comment

Related News