సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) నవంబర్ 11న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. క్రీడా, సినీ రంగాలకు చెందిన ఈ ఇద్దరు ప్రముఖుల పెళ్లి వేడుక ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ శుభసందర్భంలో కావ్యా మారన్ తన సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి ఇచ్చిన ఒక ప్రత్యేక కానుక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాధారణంగా కార్పొరేట్ సంస్థల్లో వేడుకల సమయంలో స్వీట్లు లేదా సాధారణ బహుమతులు ఇవ్వడం చూస్తుంటాం. కానీ కావ్యా మారన్(Kavya Maran) మాత్రం తన పెళ్లి జ్ఞాపకంగా సన్ గ్రూప్ ఉద్యోగులకు ఊహించని రీతిలో ఖరీదైన బంగారు ఉంగరాలను పంపిణీ చేశారు. అందమైన ప్యాకింగ్‌తో కూడిన గిఫ్ట్ బాక్సుల్లో ఈ ఉంగరాలతో పాటు నోరూరించే చాక్లెట్లు, వివాహ ఆహ్వాన పత్రికను పంపించారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి కానుకగా బంగారు నాణేలు వస్తాయని అనుకున్నామని, కానీ ఏకంగా బంగారు ఉంగరమే ఇవ్వడం తమను ఆశ్చర్యపరిచిందని సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ బహుమతుల(Gifts) విలువ, ఎంతమందికి వీటిని అందించారనే దానిపై సంస్థ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, నెటిజన్లు మాత్రం కావ్య ఉదారతను ప్రశంసిస్తున్నారు.
మొత్తానికి అనిరుధ్‌తో ఏడడుగులు వేసిన వేళ కావ్య(Kavya) తీసుకున్న ఈ చొరవ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వేడుక ఆనందంలో తోటివారిని కూడా భాగస్వాములను చేసిన తీరుపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ ఈ వార్తను మరింత వైరల్ చేస్తున్నారు. మరోవైపు, నూతన దంపతుల వివాహ విందు వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. ఈ నెల 21న చెన్నై(Chennai)లో జరిగే గ్రాండ్ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. అలాగే, తమ ఆనందాన్ని ఉద్యోగులతో నేరుగా పంచుకునేందుకు నవంబర్ 25న ప్రత్యేక విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం.