రేవంత్ కు ఆస్కార్ ఇవ్వాలన్న హరీష్ రావు! 

admin
Published by Admin — November 22, 2026 in Andhra
News Image

మాజీ మంత్రి కేటీఆర్ గడ్డం పెంచడంపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. గడ్డం పెంచినంత మాత్రాన కేటీఆర్ రేవంత్ రెడ్డి కాలేరని రేవంత్ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కేటీఆర్ గడ్డం వంటి వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేసేందుకే రేవంత్ సిద్దిపేట వచ్చారా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ సొంత జిల్లాలో ఆయన సభలకు జనం రాలేదని, దీంతో వేరే ప్రాంతాల నుంచి జనాన్ని తరలించిన విషయం అక్కడి పోలీస్ కమిషనర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు.

కరువు పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సభలో బూతులు, అబద్ధాలు రేవంత్ చెప్పారని ఆరోపించారు. సిద్దిపేటలో ఇందిరమ్మ జీవిత బీమా సభ అట్టర్ ప్లాప్ అయిందని, అందుకే రేవంత్ రెడ్డి తీవ్ర నైరాస్యంలో మునిగిపోయారని హరీష్ ఎద్దేవా చేశారు. అబద్దాలు చెప్పడంలో రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని, సభలో అబద్ధాలు చెప్పినా రేవంత్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాగునీటి హక్కులను ఆంధ్రాకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.
Tags
cm revanth reddy harish rao oscar award
Recent Comments
Leave a Comment

Related News