స‌ర్‌ప్రైజ్‌.. అబ్బాస్ ఈజ్ బ్యాక్‌

admin
Published by Admin — November 29, 2026 in Movies
News Image

టాలీవుడ్‌(Tollywood)లో ఒకప్పటి చాక్లెట్ బాయ్, యూత్ కలల రాకుమారుడు అబ్బాస్(Abbas) మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘ప్రేమదేశం’ సినిమాతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ హ్యాండ్సమ్ హీరో, ఆ తర్వాత వరుస ప్రేమకథలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే అనూహ్యంగా సినిమాలకు దూరమై, విదేశాల్లో సెటిల్ అయ్యారు. కొన్నేళ్లుగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించకపోవడంతో అబ్బాస్ పూర్తిగా నటనకు గుడ్ బై చెప్పేశారని అంతా భావించారు.

అయితే అభిమానులకు ఊహించని కిక్ ఇస్తూ అబ్బాస్ ఇప్పుడు గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. అది కూడా టాలీవుడ్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక సంక్రాంతి సినిమాతో కావడం విశేషం. తన సినిమాల్లోని ప్రతి పాత్రను ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దే అనిల్ రావిపూడి, 'జనవరి 12 విడుదల' చిత్రంలో ఓ కీలకమైన మలుపు తిప్పే రోల్ కోసం అబ్బాస్‌ను రంగంలోకి దించారు. ఇప్పటికే తమిళంలో ఓ సినిమాతో రీ-ఎంట్రీ షురూ చేసిన ఆయన, ఇప్పుడు డైరెక్ట్‌గా తెలుగు పండుగ బరిలోకి దిగుతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

నిజానికి సెకండ్ ఇన్నింగ్స్ విషయంలో అబ్బాస్ చాలా పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కేవలం ఒక్క సినిమాతోనే సరిపెట్టుకోకుండా, ఇప్పటికే మరో రెండు క్రేజీ ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వయసు పెరిగినా ఏమాత్రం తగ్గని ఛార్మ్, అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనకు ప్రధాన బలంగా మారాయి. సంక్రాంతి సినిమాతో అబ్బాస్ రీ-ఎంట్రీ గనుక క్లిక్ అయితే, రాబోయే రోజుల్లో తెలుగు దర్శకులకు ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికినట్లేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, జనవరి 12 విడుదల అనేది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో విక్టరీ వెంకటేష్‌(Venkatesh), కళ్యాణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌ లో సందడి చేయబోతుంది.

Tags
Abbas Anil Ravipudi January 12 Vidudala Sankranthi 2027 Abbas Reentry Prema Desam Actor
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News