ది ప్యారడైజ్.. కెరీర్‌లోనే నానికి బిగ్గెస్ట్ స‌వాల్‌!

admin
Published by Admin — September 19, 2026 in Movies
News Image

నేచురల్ స్టార్ నాని ఇప్పటివరకు తనదైన సహజ నటనతో, వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి సక్సెస్ బాటపట్టిన ఆయన, వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ప్రతి సినిమాతో తన మార్కెట్‌ను, మేకింగ్ స్థాయిని పెంచుకుంటూ వస్తున్న నాని కెరీర్‌లో ఇప్పుడు ఓ సరికొత్త, అత్యంత భారీ సవాల్ ఎదురుకానుంది. అదే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్(The Paradise)’.

ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, సినిమా బడ్జెట్ మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువగా పెరిగిపోయిందని స్వయంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) వెల్లడించడం విశేషం. అవుట్‌పుట్ పట్ల మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పటికీ.. ఇంతటి భారీ బడ్జెట్‌ను బాక్సాఫీస్ వద్ద రికవరీ చేయడం నాని భుజాల మీద ఉన్న అతిపెద్ద బాధ్యత.

గతంలో నాని(Nani) సినిమాలకు మంచి హిట్ టాక్ వచ్చినా, భారీ లాభాలు మిగల్చలేదనే ఓ వాదన టాలీవుడ్‌లో వినిపిస్తుంటుంది. ‘ది ప్యారడైజ్’ ఆ ముద్రను పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉంది. కేవలం మంచి సినిమా అనే ప్రశంసలతో సరిపెట్టుకోకుండా, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవాలి.

ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే, నాని కేవలం స్టార్ హీరోగానే కాకుండా తిరుగులేని క్రౌడ్ పుల్లర్‌గా తన మార్కెట్‌ను పాన్ ఇండియా స్థాయిలో మరో మెట్టు ఎక్కించడం ఖాయం. మరి ఈ భారీ సవాల్‌ను నాని ఎలా ఎదుర్కొంటారు? బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారు? అనేది వేచి చూడాలి. కాగా, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమైన ది ప్యారడైజ్‌ చిత్రంలో నానికి జోడిగా కాయడు లోహర్(Kayadu Lohar) యాక్ట్‌ చేసింది. కీర్తి సురేష్‌ స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం సెప్టెంబర్‌ 24న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Tags
The Paradise Natural Star Nani Srikanth Odela Tollywood Nani 28 Telugu Cinema Pan India Movies
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News