కేసుల దెబ్బకు హైకోర్టుకెళ్లిన సజ్జల

admin
Published by Admin — June 14, 2025 in Andhra, Politics
News Image

వైసీపీ నాయ‌కుడు.. ప్ర‌స్తుతం ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేట‌ర్‌గా ఉన్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై చ‌ర్య‌లు తీసుకో వాల‌ని.. ఏపీ అసెంబ్లీ ఉప స‌భాప‌తి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. కోరారు. ఈ మేర‌కు ఆయ‌న డీజీపీ హ‌రీష్ కుమా ర్ గుప్తాకు లేఖ రాశారు. తాజాగా సోమ‌వారం.. స‌జ్జ‌ల మీడియాతో మాట్లాడారు. రాజ‌ధానిఅమ‌రావ‌తిలో నివ సించే మ‌హిళ‌ల‌పై సాక్షి మీడియాలో వ్యాఖ్యాత చేసిన కామెంట్లపై ఆగ్ర‌హంతో ఉన్న మ‌హిళలు ఆందోళన కు దిగారు. సాక్షి కార్యాల‌యాల వ‌ద్ద నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ఈ క్ర‌మంలో సాక్షి కార్యాల‌యాల వ‌ద్ద ఉన్న పేర్ల‌ను తొల‌గించారు. సాక్షి పేప‌ర్ల‌ను కూడా త‌గుల బెట్టారు. ఈ ఘ‌ట‌న‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌కు దారి తీశాయి. అయితే.. ఈ ఆందోళ‌న‌లలో పాల్గొన్న మ‌హిళల పై స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తీవ్ర వ్యాక్య‌లు చేశారు. “సంక‌ర‌జాతి, రాక్ష‌సులు, అరాచ‌క శ‌క్తులు.. “ అంటూ కామెంట్లు కుమ్మ‌రించారు. స‌రే.. స‌హ‌జంగానే త‌మ ఆఫీసుల‌పై దాడి చేశార‌న్న అక్క‌సు ఉండొచ్చు. కానీ.. మ‌రోసారి స‌జ్జ‌ల ఇలా నోరు చేసుకోవ‌డంపై మ‌హిళ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ ప‌రిణామాల‌ను ఉటంకిస్తూ.. ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. డీజీపీకి సుదీర్ఘ లేఖ రాశారు. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచార‌ని.. ఆయ‌న‌పై త‌క్షణ‌మే కేసు న‌మోదు చేయాల‌ని కోరారు. అంతేకాదు.. ఇక‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయ‌కుండా గట్టిగా వార్నింగ్ ఇవ్వాల‌ని కూడా సూచించారు. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై పోలీసులు ఆచి తూచి స్పందించే అవ‌కాశం ఉంది. అరాచ‌క‌శ‌క్తులు-సంక‌ర జాతి.. అనే ప‌దాల వినియోగంపై న్యాయ నిపుణుల సూచ‌న‌లు తీసుకుంటున్నారు. వాటి ప్రకారం స‌జ్జ‌ల‌పై చ‌ర్యలు తీసుకునే అవ‌కాశం ఉంది.

అమరావతి రైతు దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష ఫిర్యాదు ఆధారంగా తాడేపల్లి పోలీసులు సజ్జలపై కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సజ్జల హైకోర్టును ఆశ్రయించారు.

Tags
anticipatory bail case on sajjala sajjala ramakrishna reddy
Recent Comments
Leave a Comment

Related News