నిహారిక కొణిదెల.. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఏకైక నటి. స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన నిహారిక.. ఆ తర్వాత వెండితెరపై అడుగు పెట్టింది. 2016లో `ఒక మనసు` మూవీతో హీరోయిన్ గా మారింది. ఆపై `హ్యాపీ వెడ్డింగ్`, `సూర్యకాంతం` వంటి సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. కానీ సరైన హిట్ మాత్రం పడలేదు. సరిగ్గా అదే సమయంలో నిహారిక పెళ్లి పెట్టలెక్కింది. చిరంజీవి క్లోజ్ ఫ్రెండ్ కొడుకు చైతన్య జొన్నలగడ్డ తో నిహారిక వివాహం జరిపించింది మెగా ఫ్యామిలీ.
అయితే చైతన్యతో నిహారిక వైవాహిక జీవితం ఎక్కువ కాలం సాగలేదు. 2020 డిసెంబర్‌లో చైతన్య, నిహారిక వివాహం చేసుకోగా.. 2023 మే లో మ్యూచువల్ గా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నిహారిక కెరీర్ పై ఫోకస్ పెట్టింది. నటిగా, నిర్మాతగా రాణిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు.. కూతురు నిహారిక గురించి బిగ్ బాంబ్ పేల్చారు. నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేసి తప్పు చేశామంటూ నాగబాబు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
`నిహారిక పెళ్లి విషయంలో తప్పు మాదే. మేమే అబ్బాయిని చూపించాను. మాకు ఓకే అన్నట్లు చెప్పాము. దాంతో నిహారిక కూడా పెళ్లి చేసుకుంది. కానీ అది ఆమె సొంత ఇష్టంతో కాదు. వివాహం తర్వాత వారికి సింక్ అవ్వలేదు. వాళ్లు జీవితాంతం కలిసి ఉండాలా వద్దా అనేది వాళ్ళ జడ్జిమెంట్. నేనెప్పుడూ వారి మధ్య సిమెంట్ వేయడం కానీ, నిప్పు అంటించడం కానీ చేయలేదు. అలా చేసే క్యారెక్టర్ నాది కాదు. నిహారికను అడిగాను.. ఆమె విడిపోతానంది.. ఓకే చెప్పాను. మ్యూచువల్ గానే ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం తను ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఏదో ఒక రోజు తను వేరే ఒక అబ్బాయి కలుస్తుంది. మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది` అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.