కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున మెయిన్ లీడ్స్ గా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తాజా చిత్రం కుబేర. డిఫరెంట్ స్టోరీ తో జూన్ 20వ తేదీన వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించడంతో బాక్సాఫీస్ వద్ద కుబేర కలెక్షన్స్ కుమ్మేస్తోంది. ఇదిలా ఉంటే.. కుబేర విషయంలో నాగార్జున తాజాగా మాట మార్చడం విమర్శలకు దారి తీసింది.
కుబేరలో మెయిన్ హీరో ధనుష్ కాగా.. హీరోతో సమానమైన దీపక్ పాత్రను నాగార్జున పోషించారు. ఎవరి క్యారెక్టర్స్ కు వాళ్లు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. అయితే విడుదలకు ముందు ఈ సినిమాలో అసలు హీరో ఎవరని ప్రశ్నించగా.. ధనుష్ కానీ, తాను కానీ హీరోలం కాదు. మాయాబజార్ మూవీకి డైరెక్టర్ కేవీ రెడ్డి ఎలా హీరోనో.. ఈ చిత్రానికి కూడా శేఖర్ కమ్ములనే హీరో అని ఓ ఇంటర్వ్యూలో నాగార్జున వ్యాఖ్యానించారు. కానీ కుబేర విడుదల తర్వాత ఆయన మాట మారిందంటూ ధనుష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన కుబేర సక్సెస్ మీట్‌లో నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుబేరలో తానే హీరో అన్నట్లుగా మాట్లాడారు. కుబేరలో మెయిన్ క్యారెక్టర్ తనదే అని.. తన పాత్ర చుట్టూనే మిగతా పాత్రలన్ని తిరుగుతాయని.. మొదటి నుంచి చివరి వరకు ఇది దీపక్ చిత్రమని నాగార్జున అన్నారు. నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు ధనుష్ ఫ్యాన్స్ కు రుచించడం లేదు. సినిమా పెద్ద హిట్ అవుతుండే సరికి క్రిడెట్ మొత్తం నాగార్జునే తీసేసుకుంటున్నారు అంటూ ధనుష్ అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు. కానీ ఫ్యాన్స్ ఆగ్రహంలో అర్థం లేదు. ఎందుకంటే సక్సెస్ మీట్ లో తన పాత్రకు ఉన్న ప్రాధానత్య గురించే ఆయన చెప్పారు. పైగా మరోసారి మాయాబజార్-కేవీరెడ్డి పోలికను తెస్తూ ఈ మూవీకి శేఖర్ కమ్ములనే హీరో అని వ్యాఖ్యానించారు అయినప్పటికీ.. కొందరు నాగ్‌ను పనిగట్టుకుని ట్రోల్ చేస్తుండటం గమనార్హం.