న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్న మోహన్ బాబు?

admin
Published by Admin — June 22, 2025 in Movies
News Image

మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం.. ‘కన్నప్ప’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తిగా న్యూజిలాండ్ దేశంలో చేయడం విశేషం. మొత్తం కాస్ట్ అండ్ క్రూను అక్కడికి తీసుకెళ్లి.. వేల ఎకరాలున్న ఓ ప్రాంతాన్ని అద్దెకు తీసుకుని అక్కడే పూర్తిగా చిత్రీకరణ చేసుకుని వచ్చింది చిత్ర బృందం.

న్యూజిలాండ్‌లోనే షూట్ చేయడం గురించి ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఇంకా కలుషితం కాకుండా, స్వచ్ఛంగా ఉన్న దేశం న్యూజిలాండ్ మాత్రమే అని చెప్పాడు. ఆ దేశం తనకు విపరీతంగా నచ్చిందని.. తన దగ్గర డబ్బులుంటే స్థలం తీసుకుని, పశువులను కొనుక్కుని, వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉండిపోవాలన్నది కోరిక అని విష్ణు సరదాగా వ్యాఖ్యానించాడు.

ఐతే ఓవైపు విష్ణు ఇంటర్వ్యూలో ఇలా అంటుంటే.. మరోవైపు మోహన్ బాబు ఆ దేశంలో తాము 7 వేల ఎకరాలు కొన్నట్లు ఓ వీడియోలో చెప్పడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. షూట్ బ్రేక్ టైంలో మోహన్ బాబు, మంచు విష్ణు తమ గెస్ట్ హౌస్‌లో సేదదీరుతుండగా క్యాజువల్‌గా ఈ వీడియోను ఎవరో రికార్డు చేశారు.

ఆ వీడియోలో మోహన్ బాబు మాట్లాడుతూ.. చుట్టూ ఉన్న ప్రాంతమంతా తమదే అని, ఇక్కడ 7 వేల ఎకరాలు కొన్నామని.. ఇది మంచు విష్ణుకే చెందుతుందని మోహన్ బాబు అన్నారు. దగ్గర్లో కనిపిస్తున్న కొండలు కూడా తమవే అన్నారు. మధ్యలో ప్రభుదేవా వచ్చి మోహన్ బాబుతో జాయిన్ కాగా.. తాము 7 వేల ఎకరాలు కొన్న విషయాన్ని తనకూ చెప్పి సంబరపడ్డారు మోహన్ బాబు. ఐతే మోహన్ బాబు నిజంగానే అక్కడ ల్యాండ్ కొన్నారా.. లేక షూట్ కోసం లీజుకున్న స్థలం గురించి సరదాగా ఈ మాట చెప్పారా అన్నది ఆసక్తికరం. మన దగ్గర కంటే న్యూజిలాండ్‌లో భూమి ధరలు తక్కువే కావచ్చు కానీ.. అక్కడ మరీ 7 వేల ఎకరాలు కొనాలంటే మాటలా?

Tags
7 thousand acres land kannappa movie mohan Babu bought Newzealand
Recent Comments
Leave a Comment

Related News