ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాలలో రప్పా రప్పా అనే పదం రాజకీయ వేడి రాజేసిన సంగతి తెలిసిందే. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు ఒక్కొక్కడిని నరుకుతాం అంటూ వైసీపీ కార్యకర్త ఒకరు పట్టుకున్న ప్లకార్డు వివాదానికి దారి తీసింది. ఆ వ్యవహారాన్ని ఖండించాల్సిన వైసిపి అధినేత జగన్ అది సినిమా డైలాగు… అందులో తప్పేముందని మాట్లాడడం మరింత చర్చనీయాశమైంది.
ఈ నేపథ్యంలోనే జగన్ వ్యాఖ్యలు వైసిపి కార్యకర్తలను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈరోజు కొందరు వైసిపి కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా వేట కొడవళ్ళు తీసుకొని నడిరోడ్డుపై వీరంగం వేశారు. ఇలా ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్రం మొత్తం వ్యాప్తి చేయాలని జగన్ చూస్తున్నారని, అందుకే ఆ పార్టీ కార్యకర్తలు ఈ రకంగా రెచ్చిపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.
రప్పా రప్పా అని నరకడం మంచిదేగా అంటూ జగన్ ప్రోత్సహించడంతో పల్నాడు జిల్లాలోని ఒక గ్రామంలో వైసిపి కార్యకర్తలు రెచ్చిపోయి రప్ప రప్ప నరికేస్తామంటూ వేట కొడవళ్ళతో బీహార్లో రౌడీల మాదిరిగా రోడ్ల మీదకు రావడం సంచలనం రేపింది.
ఇలాగే వైసిపి అధినేతను, వైసిపి కార్యకర్తలను వదిలేస్తే రాష్ట్రం ఎటు పోతుందో అని ప్రజలు ఆలోచించాలని పలువురు కోరుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇలాంటి చేష్టలు చేస్తే రాబోయే ఎన్నికల్లో వైసిపికి కనీసం ఒక్క సీటు కూడా రాదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు