గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించే రేంజ్ లో ఏపీలో అంతర్జాతీయ యోగా దినోత్సం నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలోనే పాల్గొన్న నారా బ్రాహ్మణి కీలక వ్యాఖ్యలు చేశారు. యోగా ప్రాముఖ్యతను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లిని ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఆమె అన్నారు. మానసిక ప్రశాంతత పొందేందుకు యోగా ఒక అద్భుతమైన మార్గమని చెప్పారు. ప్రధాని మోదీ నిరంతర కృషి వల్లే యోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. ప్రపంచంలో చాలా దేశాల ప్రజలు యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకుంటున్నారని కొనియాడారు.
ఒకేసారి 3 లక్షల మందికిపైగా యోగాసనాలు వేయడం అద్భుతమని, యోగాంధ్ర వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డు సొంతం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. అరకుకు చెందిన గిరిజనులు చేసిన సూర్య నమస్కారాలు సైతం మరో గిన్నిస్ రికార్డును సాధించడం సంతోషాన్నిచ్చిందన్నారు.