విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. రాష్ట్ర మంత్రి, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌ను ఉద్దేశించి ప్రశంసలు గుప్పించిన విషయం తెలిసిందే. యోగాంధ్ర సక్సెస్ వెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నారని కొనియాడారు. “యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ కు ప్రత్యేక అభినంద నలు“ అని మోడీ వ్యాఖ్యానించారు.
తనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు తనకు మరిన్ని బాధ్యతలు పెంచాయని వ్యాఖ్యానించారు. తాజాగా విశాఖలో ఆయన మీడియా తో మాట్లాడారు. ప్రధాని మోడీ ఎప్పుడూ ఏపీ విషయంలో సానుకూలంగానే ఉన్నారని చెప్పారు. యోగాం ధ్ర కార్యక్రమం ద్వారా గిన్నీస్ రికార్డు సృష్టించి.. దానిని ప్రధానికి కానుకగా ఇవ్వాలని భావించామని లోకేష్ తెలిపారు. ఇది సాకారం అయిందని.. ప్రజల సహకారం.. అధికారుల కృషితోనే దీనిని సాధించామని చెప్పారు.
ప్రజల చైతన్యం కారణంగానే యోగాంధ్ర విజయవంతం సాధించిందన్నారు. అనుకున్న సంఖ్య కంటే కూడా ఎక్కువగా ప్రజలు హాజరయ్యారని తెలిపారు. ప్రధాని పిలుపు మేరకు ప్రజలు భారీ ఎత్తున పాల్గొ న్నారని.. అధికారులు కూడా పూర్తిగా కష్టపడి పనిచేశారని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిం దని తెలిపారు. ప్రధాన మంత్రి తనపై చేసిన వ్యాఖ్యలు తనకు మరింత బాధ్యతను పెంచాయని తెలిపా రు.
ఇక, రాష్ట్రంలో పాలన ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని నారా లోకేష్ చెప్పారు. పాలనా సౌలభ్యం కోసమే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్టు ఓప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విశాఖను రాబోయే రోజుల్లో ఐటీ రాజధానిగా మలచనున్నట్టు తెలిపారు. వచ్చేమూడేళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్టు వివరించారు.