చాలా ఏళ్ల తర్వాత మంచు విష్ణు కన్నప్ప మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు స్వయంగా అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ భాగం కావడంతో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న కన్నప్ప.. జూన్ 27న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫస్టాఫ్ లో సాగదీత ఎక్కువున్నప్పటికీ ఓవరాల్ గా సినిమా బాగానే ఉందని మెజారిటీ ఆడియన్స్ చెప్పారు.
టాక్ అనుకూలంగా ఉండడంతో భారీ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ రన్ ను ప్రారంభించిన కన్నప్పకు మూడు రోజులకే పెద్ద షాక్ తగిలింది. ఈ సినిమాపై పైరసీ భూతం పంజా విసిరింది. అది కూడా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష్యమైంది. దాంతో తీవ్ర అసహనానికి గురైన మంచు విష్ణు.. ఎక్స్ వేదికగా పైరసీని ప్రోత్సహించవద్దంటూ వేడుకున్నాడు.
కన్నప్ప పైరసీ దాడిలో పడింది. ఇప్పటికే 30 వేలకి పైగా అక్రమ లింక్‌లను తొలగించాము. ఇది హార్ట్ బ్రేకింగ్ గా ఉందని విష్ణు తన ఆవేదన వ్యక్తం చేశాడు. పైరసీలో సినిమా చూడటమంటే దొంగతనం చేసినట్లే.. దయచేసి దానిని ప్రోత్సహించవద్దు. సినిమాను సరైన మార్గంలో సపోర్ట్ చేయండని తన తాజా పోస్ట్‌లో మంచు విష్ణు పేర్కొన్నారు. మొత్తానికి కన్నప్పతో హిట్ కొట్టిన పాపం విష్ణుకు పైరసీ రాయుళ్లు ఆ సంతోషమే లేకుండా చేశారు. ఈ పైరసీ దెబ్బ కన్నప్ప బాక్సాఫీస్ కలెక్షన్స్ ను తీవ్రంగా ప్రభావితం చేసే ఛాన్స్ బలంగా ఉంది.