గతవారం భారీ అంచనాల నడుమ విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న ఎమోషనల్ డ్రామా `కుబేర`. శేఖర్ కమ్ముల ఈ సినిమాను డైరెక్ట్ చేయగా.. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించారు. హీరోతో సమానమైన మరొక కీలక పాత్రలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా చేసింది. అపర కుబేరుడికి, ఒక బిచ్చగాడికి మధ్య సాగే ఈ సినిమా మొదటి ఆట నుంచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పాజిటివ్ టాక్ రావడం, పోటీగా మరో పెద్ద సినిమా ఏమీ లేకపోవడంతో కుబేర మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు సాగుతోంది.
ఐదు రోజుల థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 75 శాతం టార్గెట్ ను రీచ్ అయింది. వీకెండ్‌లోనే కాకుండా వీక్ డేస్‌లోనూ చక్కగా పెర్ఫార్మ్ చేస్తోంది. ఐదు రోజుల్లో ఏపీ మరియు తెలంగాణలో కుబేర చిత్రానికి రూ. 27.32 కోట్ల రేంజ్ లో షేర్, రూ. 46.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే తమిళనాడులో రూ. 16.10 కోట్లు, కర్ణాటకలో రూ. 7.05 కోట్లు, కేరళలో 1.02 కోట్ల వసూళ్లను కుబేర కొల్లగొట్టింది.
ఓవర్సీస్‌లో ఈ సినిమాకు దాదాపుగా రూ. 25.15 కోట్ల గ్రాస్ వచ్చింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ఐదు రోజుల్లో కుబేర మూవీ రూ. 49.60 కోట్ల షేర్, రూ. 98.07 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది. విడుదలకు ముందు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 65 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 66 కోట్లు. సో.. బాక్సాఫీస్ వద్ద కుబేర్ సేఫ్ అవ్వాలంటే ఇంకా రూ. 16.40 కోట్ల షేర్ ను వసూల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది