`ఏజెంట్` వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ అనంతరం లాంగ్ గ్యాప్ తీసుకున్న అఖిల్ అక్కినేని ప్రస్తుతం `లెనిన్` అనే మూవీ చేస్తున్నాడు. `వినరో భాగ్యము విష్ణుకథ` ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా ఎంపిక అయింది.
రాయలసీమ బ్యాక్‌డ్రాప్ పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో లెనిన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షూటింగ్ కూడా ప్రారంభమైంది. రీసెంట్ గా అకిల్ బర్త్‌డే సందర్భంగా బయటకు వచ్చిన టైటిల్ గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా లెనిన్ మేకర్స్ కు శ్రీలీల బిగ్ షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా నుండి ఆమె తప్పుకుందట. వాస్తవానికి కొన్ని నెలల క్రితం లెనిన్ షూటింగ్ లో శ్రీలీల ఎనిమిది రోజుల పాటు పాల్గొంది. అప్పుడు ఆమెకు సంబంధించి తీసింది కొన్ని సన్నివేశాలే.
సరిగ్గా మేజర్ షూటింగ్ ప్రారంభం అయ్యే సరికి డేట్స్ ఖాళీగా లేవని చెప్పి షాకిచ్చిందట శ్రీలీల. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ లో `ఉస్తాద్ భగత్ సింగ్`, బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో `ఆషికి 3`, కోలీవుడ్ లో శివ కార్తికేయన్ తో `పరాశక్తి` చిత్రాలు చేస్తోంది. హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉండటం, డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడంతో అఖిల్ సినిమా నుంచి శ్రీలీల సైడ్ అయిపోయిందట. ఇక శ్రీలీల తప్పుకోవడంతో లెనిన్‌లో అఖిల్ కు జోడిగా `మిస్టర్ బచ్చన్` బ్యూటీ భాగ్యశ్రీ భోర్సేను మేకర్స్ రంగంలోకి దింపుతున్నట్లు టాక్ నడుస్తోంది.