అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో AIA ఆధ్వర్యంలో CGI శాన్ ఫ్రాన్సిస్కో, ఇండియా కమ్యూనిటీ సెంటర్ (ICC) సహకారంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. జూన్ 22న "ఒక భూమి కోసం యోగా, ఒక ఆరోగ్యం" అనే థీమ్‌తో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు.
శ్రీ అభిషేక్ శర్మ (కాన్సుల్, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా), మిల్పిటాస్ మేయర్ శ్రీమతి కార్మెన్ మోంటానో, శాంటా క్లారా కౌంటీ సూపర్‌వైజర్ శ్రీ ఒట్టో లీ, శాంటా క్లారా కౌన్సిల్ సభ్యుడు శ్రీ రాజ్ చాహల్, సన్నీవేల్ కౌన్సిల్ సభ్యుడు శ్రీ మురళీ శ్రీనివాసన్, శ్రీ మనోజ్ గోయెల్ (ఐసిసి), మరియు సిస్టర్ కుసుమ్ (బ్రహ్మ కుమారిస్) వంటి ప్రముఖులు ఈ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు.
ఒత్తిడి తగ్గించుకునేందుకు, మానసిక స్పష్టత మరియు శారీరక ఆరోగ్యం కోసం ప్రతిరోజు యోగా చేయాలని అభిషేక్ శర్మ అన్నారు. యోగా యొక్క శాస్త్రీయ ఔచిత్యాన్ని, ప్రయోజనాలను ఆయన చక్కగా వివరించారు. రోజువారీ జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావించారు. వ్యక్తిగత అవసరాలు . జీవనశైలికి యోగా ఎంత అవసరమో చెప్పారు.
సిస్టర్ కుసుమ్ నేతృత్వంలో "ధ్యానం మరియు స్వీయ పరివర్తన" అనే సెషన్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది, అంతర్గత శాంతి, మానసిక స్పష్టత మరియు వ్యక్తిగత శ్రేయస్సు లపై ఈ సెషన్ ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత యోగా నిపుణుడు శ్రీ మనోజ్ శర్మ నేతృత్వంలో ఒక ఆకర్షణీయమైన సెషన్ జరిగింది, వ్యక్తిగత ఆరోగ్యం, సామాజిక వ్యవహారాలు..ఇలా రెండింటికీ యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని మనోజ్ అన్నారు. యోగాసనాలు, కపాలభతి, ప్రాణాయామం, ధ్యానం, సంకల్ప మరియు ధ్యానం వంటి ఆసనాలు...శ్వాస పద్ధతుల గురించి ఆయన వివరించారు.
డీప్ రిలాక్సేషన్ టెక్నిక్స్‌పై డాక్టర్ అంబిలి సుధాకరన్ ఒక సెషన్‌ను నిర్వహించారు. ఇందులో పాల్గొనేవారికి ఆచరణాత్మక అభ్యాసాన్ని అందించారు. అందరికీ అందుబాటులో నాణ్యమైన యోగా శిక్షణను ఆయన ఇచ్చారు.
ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) నిర్వహించింది. కొన్ని సంస్థల నుండి బలమైన మద్దతుతో ఏఐఏ ఈ ఈవెంట్ విజయవంతం చేసింది. యోగాపై ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరినీ AIA ధన్యవాదాలు తెలిపింది.