టాలీవుడ్ హీరో రామ్ పోతినేనికి రాజమండ్రిలో పెను ప్రమాదం తప్పింది. ఇద్దరు దుండగుల బారి నుంచి రామ్ తెలివిగా ఎస్కేప్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం రామ్ `ఆంధ్ర కింగ్ తాలూకా` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు. పి డైరెక్టర్. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ తాజా షెడ్యూల్ రీసెంట్ లో రాజమండ్రిలో ప్రారంభమైంది. అక్కడ ప్రస్తుతం రామ్‌పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
అయితే రాజమండ్రిలో షూటింగ్ కావడం వల్ల రామ్ అక్కడే షెరటాన్ హోటల్‌లో స్టే చేస్తున్నాడు. హోటల్‌లోని 6వ ఫ్లోర్‌లో ఉన్న వీఐపీ రూమ్‌ను రామ్ కు కేటాయించారు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు గుట్టు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి రామ్ రూమ్ ముందు హైడ్రామా క్రియేట్ చేశారు. షూటింగ్ ముగించుకున్న రామ్య.. యధావిధిగా నిన్న కూడా హోటల్‌కు చేరుకుని తన రామ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
అయితే సోమవారం అర్థరాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు హోటల్ మేనేజ్మెంట్ వద్దకు వచ్చి తాము చిత్రబృందమని చెప్పి.. లిఫ్ట్ యాక్సెస్ తీసుకుని నేరుగా రామ్ రూమ్ వద్దకు వెళ్లారు. ఆపై రామ్ రూమ్ డోర్స్ ను దబాదబా బాదడం, తనడం మొదలుపెట్టారు. అప్పటికే డీప్ స్లీప్‌లో ఉన్న రామ్.. డోర్ మోగుతున్న సౌండ్స్‌కు మేల్కొన్నాడు. అయితే తలుపులు ఓపెన్ చేయకుండా తెలివిగా రామ్ యూనిట్ కు ఫోన్ చేసి చెప్పడంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో హుటాహుటిని హోటల్ వద్దకు చేరుకున్న పోలీసులు.. రామ్ రూమ్ బయట రచ్చ చేస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రధామిక విచారణ ప్రకారం.. సదరు వ్యక్తులు ఫుల్‌గా తాగేసి ఉన్నారు. రామ్‌ను కలవడానికే ఇదంతా చేశామని చెబుతున్నారట. ఏదమైనా రామ్ డోర్ తీయకపోవడం మంచిదైందని అంటున్నారు.