2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లతో కనీవిని ఎరుగని రీతిలో అఖండ విజయం సాధించింది వైసీపీ. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా అందరినీ ఆశ్చర్య పరుస్తూ కేవలం 11 సీట్లకు పరిమితం కావడంతో వైసీపీ నేతలతో పాటు కార్యకర్తలకూ భారీ షాక్ తగిలింది. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నరీతితో వైసీపీ ఘోర పరాజయానికి, పరాభవానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మనం ఎందుకు ఓడిపోయాం అని సగటు వైసీపీ కార్యకర్త తనను తాను ప్రశ్నించుకుంటూ...జగన్ ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు వైరల్ గా మారింది. ఆ పోస్టు యథాతధంగా...
-) మనం తల్లులకు ఇద్దరు పిల్లలకి 30000 ఇస్తామని చెప్పి 13000 మాత్రమే ఇచ్చా మ్..
వాళ్ళు తల్లికి వందనం అంటూ 26,000 ఇస్తున్నారు, 39 వేలు ఇస్తున్నారు 52,000 ఇస్తున్నారు. ఏమని నిలదీయాలి..?
-) మత్స్యకారుల కు మనం 10,000 ఇస్తే.. ఆ చంద్రబాబు 20000 ఇచ్చేసాడు. ఏమని నిలతీయాలి..?
-) మనం మహిళలకు సిలిండర్ ఫ్రీగా ఇవ్వలేకపోయాం.
చంద్రబాబు ఏడాది కి మూడు సిలిండర్ లు ఫ్రీ గా ఇస్తున్నారు. ఆల్రెడీ 2 సిలిండర్ లకు డబ్బులు కూడా అకౌంట్ లలో పడ్డాయ్. ఏమని నిలతీయాలి..?
-) మనం చిన్న చిన్న రోడ్ లు కూడా వేయలేకపోయాం. కనీసం రిపేర్ చేయలేకపోయామ్..
వాళ్ళు రోడ్లు వేస్తున్నారు..ఏమని నిలదీయాలి..?
-) మనం చెత్త మీద పన్ను వేశాం, బలవంతంతంగా వసూలు చేశాం.
వాళ్ళు చెత్త మీద పన్నులు తీసేశారు..
-) మనం కనపడిన ప్రతి దానికి నీలి రంగు వేసాం..
వాళ్ళు అటువంటివి ఏం లేకుండా చక్కగా ఉన్నారు.
మనం ప్రశ్నించిన వాడిని బెదిరించడం కొట్టాం,తిట్టాం, కొందరిని చంపేశాం...
వాళ్లు అటువంటి ఏమి చేయట్లేదు. ఏమని ప్రశ్నించాలి..?
వికలాంగుల కు మనం ఇచ్చిన పెన్షన్ మొదటి ఏడాది 2250/- .. చంద్రబాబు ఇస్తున్నది 6000/- ఏమని ప్రశ్నించాలి?? ఏమని నిలతీయాలి..?
-) వాళ్లు టిసిఎస్ కాగ్నిజెంట్ గూగుల్ వంటి పెద్ద పెద్ద సంస్థలను తెస్తున్నారు.. మనం ఉన్న ఇండస్ట్రీస్ ని కూడా తరిమేశామ్.. ఏమని అడగాలి..? ఏమని ప్రశ్నించాలి..?
-) మనం మద్యపాన నిషేధం చేస్తామ్ అని చెప్పి మన సొంత బ్రాండ్ లతో పిచ్చి మందు కలిపి మందుని అధిక రేట్లకు అమ్మేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడాం...
వాళ్లు ఆ బ్రాండ్లన్నీ తీసేసారు, ధరలు కూడా తగ్గించేసి మంచి మద్యం ని అందిస్తున్నారు.
ఏమని అడగాలి..? ఎవరిని నిలతీయాలి..?
-) మనం నాడు నేడు అని గొప్పలు చెప్పామే కానీ.. నీలి రంగులు వేసినామే కానీ.., ఒక్క టీచర్ని నియమిచలేకపోయాం.... వాళ్లు డీఎస్సీ వేసి 16 వేల మంది టీచర్లను ఫిల్ చేస్తున్నారు.. ఏమని నిలదీయాలి..? టీచర్ల చేత వంట పనులు, కొన్నిచోట్ల బాత్రూంలో పనులు చిక్కీలు వంటివే చేయించాం.
వాళ్ళు అటువంటి ఏమీ చేయించటం లేదు.. అటువంటి యాప్ లనూ తీసేసారు.. టైం కి జీతాలు ఇస్తూ పాలిస్తున్నారు.
పేదవాళ్లు, మధ్య తరగతివాల్లు పట్టేడన్నం తినే అన్న క్యాంటీన్లను మనం కూల్చేశాం..
వాళ్ళు వచ్చి రాగానే మనం కూల్చేసినవన్నీ నిర్మించి కొత్తవి కూడా కడుతూ అందరికీ కడుపునిండా అన్నం పెడుతున్నారు.
ఏమని ప్రశ్నిస్తాము ఎమని నిలదీస్తాం..??
నిలదీస్తే నిన్నే నిలదీయాలి.. ప్రశ్నిస్తే నిన్నే ప్రశ్నించాలి.. రీకాల్ కూడా మనమే చేసూకోవాలి జగనన్నా..
పోనీ అసేంబ్లీ కి అయినా పోతున్నామా..?
అసలు వాళ్ళని మనం నిలదీసేందుకు నైతికత ఉందా జగనన్నా..?