ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే మరియు సినీ నటుడు పవన్ కళ్యాణ్ కు నలుగురు సంతానం అన్న సంగతి తెలిసిందే. మాజీ భార్య రేణు దేశాయ్ ద్వారా అకిరా నందన్, ఆధ్యలకు జన్మనిచ్చిన పవన్ కళ్యాణ్.. అన్నా లెజ్నెవా ద్వారా కూతురు పోలెనా అన్జనా పవనోవా, కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ లకు తండ్రి అయ్యారు. రేణు దేశాయ్‌తో విడాకులు తీసుకున్నప్పటికీ అకిరా, ఆధ్యల బాధ్యతను మాత్రం పవన్ వదులుకోలేదు. తన నలుగురు బిడ్డలను సమానంగా చూసుకుంటున్నారు.
కొద్ది నెలల క్రితం తిరుపతిలో తన ఇద్దరు కూతుళ్లతో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించిన పవన్.. తాజాగా కొడుకులతో దర్శనమిచ్చారు. పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి పవన్ మంగళగిరిలోని తన నివాసానికి వచ్చారు. నిజానికి ఒకేసారి ఇద్దరు కొడుకులతో పవన్ కనిపించడం చాలా రేర్. ఎందుకంటే, మార్క్ శంకర్ మొన్నటి వరకు సింగపూర్‌లోనే ఉండేవాడు.
అయితే కొద్ది రోజుల క్రితం అక్కడి స్కూల్‌లో మార్క్ అగ్రి ప్రమాదానికి గురికావడంతో.. పవన్ తనయుడ్ని ఇండియాకు తీసుకొచ్చేశారు. హైదరాబాద్‌లోనే స్కూల్‌లో జాయిన్ చేశారు. ఇక శుక్రవారం ఉదయం ఓవైపు పెద్దోడు.. మరోవైపు చిన్నోడితో కలిసి పవన్ మంగళగిరికి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫస్ట్ టైమ్ ముగ్గుర్నీ ఒకే ఫ్రేమ్ లో చూసి మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. `తండ్రీ తనయులు` అనే క్యాప్షన్ తో ఈ ఫోటోను మరింత ట్రెండ్ చేస్తున్నారు. కాగా, మంగళగిరిలోని తన నివాసంలో కుటుంబంతో కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసిన పవన్.. ఆ వెంటనే పార్టీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమావేశం అయ్యారు. అనంతరం మార్కాపురం నియోజకవర్గ పర్యటనకు బయలుదేరారు.