మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో ఓ మూవీ సెట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో వెంకీ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్స్ `నువ్వు నాకు నచ్చావ్`, `మల్లీశ్వరి` చిత్రాలకు త్రివిక్రమ్ రచన విభాగంలో పనిచేశారు. ఇప్పుడు వెంకీని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నారు. ప్రస్తుతం వీరి కాంబో మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 2026 సమ్మర్ లో సినిమాను విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
ఇదే తరుణంలో టైటిల్ కు సంబంధించి కూడా ఓ న్యూస్ వైరల్ గా నెట్టింట మారింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న వెంకీ-త్రివిక్రమ్ మూవీకి `వెంకట రమణ` అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. `కేర్ ఆఫ్ ఆనంద నిలయం` అనేది ట్యాగ్ లైన్. కథకు వెంకట రమణ టైటిల్ సరిగ్గా సరిపోతుందట. కథలో వెంకీ క్యారెక్టర్ నేమ్ కూడా అదే అని.. సో దాన్నే లాక్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట.
త్వరలోనే సినిమా మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉండొచ్చని అంటున్నారు. కాగా, ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడిగా నటించే హీరోయిన్ ఎవరు అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. మొన్నటి వరకు `సప్త సాగరాలు దాటి` ఫేమ్ రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ చెన్నై బ్యూటీ త్రిష వైపు మొగ్గు చూపుతున్నారట. ఆన్ స్క్రీన్ పై వెంకీ - త్రిష సూపర్ హిట్ కాంబినేషన్. మరి త్రివిక్రమ్ మూవీతో మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతుందేమో చూడాలి.