టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అన్న టాక్ ఉన్న సంగతి తెలిసిందే. కార్యకర్తలకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే తామున్నామంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ముందుకు వస్తుంటారు. ఈ క్రమంలోనే క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ టీడీపీ కార్యకర్తకు సీఎం చంద్రబాబు స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడిన వైనం వైరల్ గా మారింది. చంద్రబాబుతో మాట్లాడాలన్న ఆ కార్యకర్త చివరి కోరికను నెరవేర్చారు.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ ముందు నుంచి టీడీపీ వీరాభిమాని. చంద్రబాబు అంటే కృష్ణకు ఎనలేని అభిమానం. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ ఆరోగ్యం క్షీణిస్తున్న కృష్ణ జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబుతో మాట్లాడాలని అనుకున్నారు. ఆ విషయం చంద్రబాబు దగ్గరకు వెళ్లడంతో ఆయన స్వయంగా వీడియో కాల్ చేసి కృష్ణ చివరి కోరిక తీర్చారు.
ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని కృష్ణకు, ఆయన కుటుంబ సభ్యులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. చంద్రబాబు ఫోన్ చేసిన మాట్లాడడంతో కృష్ణ తీవ్ర హర్షం వ్యక్తం చేసి భావోద్వేగానికి లోనయ్యారు.
https://twitter.com/i/status/1941516044285379072