సీఎం చంద్రబాబుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధర్ రెడ్డి..కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు తీరు గురించి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను ఓపికగా విన్న కోటం రెడ్డి... వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ పాలనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తోందని చెప్పారు. వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా గాడిలో పడుతున్నాయని అన్నారు.