ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు, తమిళ స్టార్ హీరో ఆర్ మాధవన్ ఐదు పదుల వయసులో మరింత జోరు చూపిస్తున్నారు. ఇటు సౌత్ తో పాటు నార్త్ లోనూ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. ఏడాదికి అరడజను పైగా చిత్రాల్లో నటిస్తూ బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తున్న మాధవన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లైన నటీమణులపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
వివాహం అయిన హీరోయిన్లు ఆన్ స్క్రీన్ పై రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి పనికిరారు అన్నట్లుగా మాధవన్ మాట్లాడారు. అందుకు గల రీజన్ ఏంటో స్పష్టంగా వివరించారాయన. నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్ గురించి కూడా ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. మాధవన్ మాట్లాడుతూ.. `సినిమాకు కథ మాత్రమే ముఖ్యం. నా దృష్టిలో హీరో హీరోయిన్ మధ్య వయసు వ్యత్యాసం సమస్య కాదు.
అయితే స్క్రీన్ పై నటీనటుల మధ్య కెమిస్ట్రీ బాగుండాలంటే నిజమైన ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. అలా లేకపోతే ఆ సీన్ సహజంగా ఉండదు. నేను చెప్పే ఈ మాటలు వివాదానికి దారితీస్తాయేమో కానీ.. వివాహం అయిన హీరోయిన్స్ రొమాంటిక్ సన్నివేశాలు సరిగ్గా నటించలేరు. ఆల్రెడీ రియల్ లైఫ్ లో ఒకకరితో రిలేషన్ లో ఉంటున్నప్పుడు.. స్క్రీన్ పై మరొకరితో వారు కెమిస్ట్రీని సరిగా పండించలేరు.` అంటూ వ్యాఖ్యానించారు. విడిపోయిన లేదా ఇకపై కలిసి లేని జంటలకు ఇది వర్తించదని ఆయన స్పష్టం చేశారు. మాధవన్ బోల్డ్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు.