వైసీపీ అధినేత జగన్‌కు షాకులపై షాకులు తగులుతున్నాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన విఫలమైన షాకు నుంచి ఆయన, ఆ పార్టీ నాయకులు ఇంకా కోలుకోక ముందే.. కొన్ని గంటల వ్యవధిలోనే.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు(2021లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించారు) జనసేన తీర్థం పుచ్చుకు న్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆ నలుగురు నాయకులు వైసీపీ కండువా వదిలి.. జనసేన జెండా కప్పుకొన్నారు.
తాజాగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారంతా.. జెడ్పీటీసీలే కావడం గమనార్హం. వచ్చే ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిచేరిక జనసేనలో జోష్ నింపగా.. వైసీపీకి భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. వీరిలో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన పొల్నాటి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన ముత్యాల ఆంజనేయులు, అత్తిలికి చెందిన జానకి, పెరవలికి చెందిన రజనీ ఉన్నారు. వీరంతా జనసేన ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వచ్చి.. పవన్ కల్యాణ్ సమక్షంలో జెండా మార్చేశారు.
జగన్‌కు తలాతోకా లేదు
పార్టీ మారిన జెడ్పీటీసీలు.. వైసీపీ అధినేత జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని నడిపించలేక పోతున్నారని వారు వ్యాఖ్యా నించారు. తలా తోకా లేకుండా.. తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని ప్రజలకు దూరం చేస్తున్నాయని.. ఈ విషయాన్ని చెప్పుకొ నేందుకు తాము ప్రయత్నించినా.. తమ మాటను జగన్ వినిపించుకోవడం లేదన్నారు.
అందుకే.. పార్టీ మారాలని..ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం అవుతోందని చెప్పారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే తమను జనసేనవైపు ఆకర్షించా యని తెలిపారు.