ఏపీ సీఎం చంద్రబాబు జూలై నెల 27 నుంచి 29 వరకు సింగపూర్ లో అధికారికంగా పర్యటించబోతున్నారు.
జూలై 27వ తేదీ ఆదివారం నాడు సింగపూర్ లోని తెలుగు ప్రజలతో చంద్రబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని తెలుగు ప్రజలంతా పాల్గొనాలని ఏపీఎన్నార్టీఎస్ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వేదిత, ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరు కాదలిచిన వారు క్రింద తెలిపిన లింక్ ద్వారా రిజిస్టర్ కావాలని, తద్వారా వచ్చే సభ్యులకు తగిన ఏర్పాట్లు చేయడానికి వెసులుబాటు ఉంటుందని రవి వేమూరు అన్నారు.
https://nritdp.com/singapore_
ఆంధ్రప్రదేశ్ నుంచి లేదా అంధ్రప్రదేశ్ కు ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్ పై ఆసక్తి ఉన్నవారి కోసం ఏపీఎన్నార్టీఎస్ ప్రత్యేకంగా డెస్క్ ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేవారి కోసం మరో డెస్క్, ఏపీఎన్నార్టీఎస్ సీఎక్స్ వో క్లబ్ లో సభ్యత్వం కోసం మరో డెస్క్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఏపీఎన్నార్టీఎస్ సభ్యుల కోసం, సింగపూర్ లో ఉంటోన్న ప్రవాసాంధ్రుల కోసం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి దాకా ఏపీఎన్నార్టీఎస్ లో సభ్యత్వం లేనివారు ఈ క్రింద తెలిపిన లింక్ క్లిక్ చేసి సభ్యత్వ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
https://apnrts.ap.gov.in/