ఏపీ పాలిటిక్స్ లో సెన్సేషన్ గా మారిన లిక్కర్ స్కామ్ కేసులో ఏ5 గా ఉన్న మాజీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి నిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో సాయి రెడ్డి విచారణకు హాజరయ్యారు. గత ఏప్రిల్ 18న సాయి రెడ్డిని సిట్ అధికారులు మొదటిసారి విచారించారు. ఇప్పుడు రెండోసారి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి విచారణలో విజయసాయిరెడ్డి ఎటువంటి విషయాలను బయటపెడతారో అని వైసీపీ నేతలు గుబులుగా ఉన్నారు.
ఇదిలా ఉండగా సిట్ విచారణ వేళ విజయసాయిరెడ్డి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఉదయం ఏడు గంటల సమయంలో కర్మఫలాల గురించి భగవద్గీతలోని శోకాన్ని ఆయన పోస్ట్ చేశారు. `ప్రతిపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీలు రాజధర్మాన్ని అనుసరించాలి` అని హిందీలో తన పోస్ట్ ప్రారంభించిన సాయిరెడ్డి..
`కర్మణ్యే వాధికారస్తే
మాఫలేషు కదాచన!
మా కర్మఫలహేతుర్భూ:
మా తేసంగోஉస్త్వకర్మణి!!
కర్మలను ఆచరించుట యండే నీకు అధికారము కలదు
కానీ వాని ఫలితముల మీద లేదు.
నీవు కర్మఫలములకు కారణం కారాదు.
అట్లని కర్మలను చేయుట మానరాదు. `
అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ పై అనేక చర్చలకు దారితీసింది. అసలు విజయసాయిరెడ్డి ఇప్పుదెందుకు ఈ విధంగా ట్వీట్ చేశారు? ఎవర్ని ఉద్ధేశించి చేశారు? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కామెంట్ సెక్షన్‌లో మాత్రం నెటిజన్లు సాయి రెడ్డి పోస్ట్‌పై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.