శృతి హాసన్.. లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన ప్రతిభతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడే ముద్దుగుమ్మల్లో శృతి హాసన్ ఒకరు. ఇప్పటికే ఈమె లైఫ్ లో రెండు విఫలమైన ప్రేమ కథలు ఉన్నాయిజ వాటి ప్రభావమో ఏమో కానీ తాజాగా పెళ్లి పై శృతిహాసన్ విముఖత వ్యక్తం చేసింది. అయితే పిల్లలు మాత్రం కావాలంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్ మాట్లాడుతూ.. `పెళ్లి అన్న ఆలోచనే భయంకరంగా ఉంది. పెళ్లి అంటే నిబద్ధత, ఎన్నో బాధ్యతలు. ఇద్దరు వ్యక్తులు పరస్పరం అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం. ఒక టైమ్ లో పెళ్లి వరకు వెళ్లాను కానీ వర్కౌట్ కాలేదు. పెళ్లంటే భయం కానీ పిల్లల మాత్రం కావాలనే కోరిక నాకు బలంగా ఉంది. కాకపోతే సింగిల్ మదర్ గా ఉండడం అనేది అంత సులభం కాదు. నేను కూడా అలాంటి కుటుంబంలో పెరుగాను. తల్లి, తండ్రి ఇద్దరు ఉంటేనే పిల్లల పెంపకం బాగుంటుంది` అంటూ శృతిహాసన్ చెప్పుకొచ్చింది.
మొత్తానికి ఈ 39 ఏళ్ల ముద్దుగుమ్మ పెళ్లిపై ఒక నిర్ణయానికి రాలేకపోతుంది. అయితే పిల్లలు కావాలని మాత్రం ఆశ పడుతుంది. మరి పిల్లల కోసం పెళ్లి చేసుకుంటుందా? లేక అడాప్షన్ వైపు మొగ్గు చూపుతుందా? అన్నది చూడాలి. కాగా, శృతి హాసన్ మొదట లండన్ కు చెందిన నటుడు మైఖేల్ కోర్సేల్ తో సుధీర్గమైన ప్రేమాయణం నడిపింది. కానీ పెళ్లి వరకు వెళ్లకుండానే ఈ జంట విడిపోయారు. ఆ తర్వాత డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో శృతి ప్రేమలో పడింది. మూడేళ్ల పాటు సాగిన వీరి బంధం గత ఏడాది ముక్కలైంది. ప్రస్తుతం శృతి హాసన్ సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తోంది.