టాలీవుడ్ దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
1942 జూలై 10న కాకినాడలో జన్మించిన కోట శ్రీనివాసరావు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారు. నాటక రంగంపై విపరీతమైన ఇష్టం ఉన్న కోట ఎస్బీఐలో ఉద్యోగం చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవారు.1978లో ప్రాణం ఖరీదు సినిమాతో తెరంగేట్రం చేసిన కోట చివరగా సువర్ణ సుందరి అనే సినిమాలో నటించారు. 40 ఏళ్ల ప్రస్థానంలో 750 సినిమాల్లో నటించిన కోట 9 నంది అవార్డులు సాధించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్న కోట...1999లో బీజేపీ తరఫున విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా విజయం సాధించి రాజకీయాలలోనూ రాణించారు.