చిరు-అనిల్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..!

admin
Published by Admin — July 12, 2025 in Movies
News Image

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో `మెగా 157`  వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. నయనతార ఇందులో హీరోయిన్. విక్టరీ వెంకటేష్ ఒక స్పెషల్ క్యారెక్టర్ లో అలరించబోతున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ల‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లి బుల్లెట్ ట్రైన్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుంది.

సంక్రాంతి టార్గెట్ గా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను అనిల్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయలేదు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు. ఈ స్పెషల్ డేను పురస్కరించుకుని టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే చిరు, అనిల్ మూవీ టైటిల్ ఇదే అంటూ ఓ న్యూస్ తాజాగా తెరపైకి వచ్చింది.

దాని ప్రకారం.. ఈ సినిమాకు `మన శంకర్ వరప్రసాద్ గారు` అనే ఇంట్రెస్టింగ్ టైటిట్ ను మేక‌ర్స్‌ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. సినిమాలో చిరంజీవి తన ఒరిజినల్ నేమ్ అయిన శివ శంకర్ వరప్రసాద్ పేరుతోనే కనిపిస్తారట. ఇక ఆయ‌న క్యారెక్ట‌ర్ మ‌రియు క‌థకు తగ్గట్టు టైటిల్ ను కూడా ఆ పేరుతోనే పెడుతున్నారని టాక్ న‌డుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

Tags
Chiranjeevi Anil Ravipudi Nayanthara Mega 157 Tollywood Telugu Movies Latest News
Recent Comments
Leave a Comment

Related News