హైదరాబాద్ లో కోడ్ వర్డ్ తో గంజాయి రాకెట్..గుట్టురట్టు

admin
Published by Admin — July 14, 2025 in Telangana
News Image

గంజాయి..మాదకద్రవ్యాల వినియోగం అంతకంతకు పెరిగిపోతున్న వేళ.. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. తాజాగా టీజీ న్యాబ్ (ఈగల్ టీం) మత్తుబాబుల్ని పట్టుకునేందుకు భారీగా స్కెచ్ వేశారు. ఇందుకోసం 100 మంది పోలీసులతో కలిసి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ‘భాయ్.. బచ్ఛా ఆగయా భాయ్’ పేరుతో ఒక మెసేజ్ ను గంజాయి వినియోగించే వారికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు.


దీనికి ప్రతిగా దాదాపు 14 మంది దొరికిపోయారు. మహారాష్ట్ర నుంచి గచ్చిబౌలిలోని కొనుగోలుదారులకు గంజాయిని సప్లై చేసేందుకు వీలుగా జరిగిన ఏర్పాటుకు సంబంధించిన సమాచారం టీన్యాబ్ వారికి తెలిసింది. దీంతో వారు ఒక డెకాయ్ ఆపరేషన్ ను నిర్వహించారు. రోటీన్ కు భిన్నంగా నిర్వహించిన ఈ కొత్త డెకాయ్ ఆపరేషన్ గాలానికి పలువురు దొరికేశారు.మహారాష్ట్రకు చెందిన సందీప్ హైదరాబాద్ కు ట్రైన్ లో గంజాయి సప్లై చేస్తాడు. తాను సిటీకి వచ్చినట్లుగా సమాచారం అందించేందుకు వీలుగా వంద మందితో ఉన్న వాట్సాప్ గ్రూపులో కోడ్ భాషలో ‘భాయ్.. బచ్ఛా ఆగయా భాయ్’ అని మెసేజ్ పెడతారు.


దీంతో.. అతను వస్తున్న విషయం అందరికి అర్థమవుతుంది. అనంతరం తాను వచ్చే ప్లేస్ చెబుతాడు. దానికి తగ్గట్లు అక్కడకు చేరుకొన్న వారికి గంజాయి పాకెట్లను ఇచ్చేస్తాడు. పోలీసులు దీన్ని పసిగట్టి.. ఆ వాట్సాప్ గ్రూపులో తామే కో్ మెసేజ్ ను పెట్టారు. దీనికి స్పందించిన పలువురు రావటం.. పోలీసులకు దొరికిపోయారు. ఇలా దొరికిన పద్నాలుగు మందిలో ఎక్కువ ఐటీ ఉద్యోగులు కావటం గమనార్హం. మరింత షాకింగ్ అంశం ఏమంటే.. ఇందులో రెండు జంటలు ఉన్నాయి. మరొకరు అయితే భార్య.. నాలుగేళ్ల పిల్లాడితో కలిసి గంజాయి కొనుగోలు చేసేందుకు రావటం గమనార్హం. నాలుగేళ్ల కొడుకుతో వచ్చి పోలీసులకు దొరికిన జంటలో భార్యభర్తలు ఇద్దరు గంజాయికి అలవాటు పడిన విషయాన్ని పోలీసులు గుర్తించారు.


దీంతో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  వారిని డిఆడిక్షన్ సెంటర్ కు తరలించారు.ఇక.. గంజాయి సప్లై చేసే సందీప్ విషయానికి వస్తే.. వారంలో ఒక రోజు 5 కేజీల గంజాయిని కొనుగోలు చేసి.. ఒక్కో పాకెట్ 50 గ్రాముల చొప్పున మొత్తం వంద పాకెట్లు తయారు చేస్తాడు. ఒక్కో పాకెట్ ను రూ.3 వేల చొప్పున అమ్ముతాడు. అంటే.. మొత్తం రూ.3 లక్షలకు అమ్మేసి వెళ్లిపోతాడు. ప్రతి వీకెండ్ లోనూ సిటీకి వచ్చి భారీగా సొమ్ము చేసుకొని వెళ్లిపోతాడు. సందీప్ తయారుచేసిన 100 మంది వాట్సాప్ గ్రూపులో 14 మందిని అదుపులోకి తీసుకొని పరీక్షించగా అందరికి పాజిటివ్ వచ్చింది. గ్రూపులోని మిగిలిన 86 మంది సమాచారాన్ని సేకరించి.. వారి వివరాల్ని ఆరా తీస్తున్నారు.

Tags
Hyderabad junkies using bacha as code word weed
Recent Comments
Leave a Comment

Related News