చెన్నై పోలీసులకు వినుత దంపతులు ఏం చెప్పారు?

admin
Published by Admin — July 16, 2025 in Andhra
News Image
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన శ్రీకాళహస్తి డ్రైవర్ హత్య కేసులో జనసేన మహిళా నేత వినుత.. ఆమె భర్తను.. మరికొందరు అనుమానితుల్ని చెన్నై పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే. ఈ హత్య కేసుకు సంబంధించి వారిని విచారించిన చెన్నై పోలీసులకు వారేం చెప్పారు? డ్రైవర్ హత్య పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయన్న విషయాల్ని వెల్లడించినట్లుగా తెలుస్తోంది. తమ వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తమను బ్లాక్ మొయిల్ చేసినట్లుగా ఆరోపించినట్లు తెలుస్తోంది.
 
తమను ఇబ్బంది పెడుతున్న శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జలపై పార్టీ అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్న వారు.. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఇబ్బంది లేకుండా సెటిల్ చేస్తామన్న హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే.. తాను ఇచ్చిన మాట ప్రకారం పవన్ కల్యాణ్ తమను పట్టించుకోలేదని.. ఒకవేళ ఆయన బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే డ్రైవర్ శ్రినివాస్ హత్య వరకు విషయం వెళ్లేది కాదని చెప్పినట్లుగా తెలుస్తోంది.
 
చెన్నై పోలీసులతో వినుత దంపతులు చెప్పిన వివరాల్ని వారు వెల్లడించారు. ‘శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేే బొజ్జల సుధీర్ రెడ్డి మా బెడ్రూంలో మూడు రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డు చేయించారు. మా డ్రైవర్ శ్రీనివాస్ ను ప్రలోభ పెట్టి సదరు వీడియోలను రూ.30 లక్షలకు అమ్మేలా చేశారు. వాటితో తన వర్గీయుల ద్వారా మమ్మల్నిబ్లాక్ మొయిల్ చేయసాగారు.
 
ఈ విషయం తెలిసిన వెంటనే శ్రీనివాస్ ను విధుల నుంచి తొలగించాం. వ్యక్తిగత వీడియోలతో మమ్మల్ని బ్లాక్ మొయిల్ చేస్తున్న అంశాన్ని మా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు తెలిపాం. దీని వెనుక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారని చెప్పగా.. సీఎం చంద్రబాబుతో.. ఎమ్మెల్యే బొజ్జలతో మాట్లాడతానని చెప్పారు. ఇష్యూను సెటిల్ చేస్తానని చెప్పారు’’ అంటూ వినుత దంపతులు పోలీసులకు చెప్పారు.
పవన్ కల్యాణ్ హామీని తాము విశ్వసించామని.. కానీ ఆ తర్వాత నుంచి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ తమను బ్లాక్ మొయిల్ చేస్తూ.. బెదిరింపులు పెంచారన్నారు.
 
పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నప్పుడు పవన్ కల్యాణ్ తమను అడ్డుకోకుంటే విషయం ఇంతవరకు వచ్చేది కాదన్నారు. దీంతో తమ ఫిర్యాదును పవన్ కల్యాణ్ పట్టించుకోలేదని తాము తెలుసుకున్నట్లుగా చెప్పినట్లు చెన్నై పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ బ్లాక్ మొయిలింగ్ అంశంపై వివరాల్ని తెలుసుకోవటానికి డ్రైవర్ శ్రీనివాస్ ను పిలిపించామని.. గట్టిగా నిలదీశామననారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రూ.30 లక్షలు ఇచ్చి వీడియోలు తీసుకున్నట్లుగా తమకు చెప్పినట్లు వెల్లడించారు.
 
టీడీపీ ఎమ్మెల్యే ఇచ్చిన రూ.30 లక్షల్లో రూ.20 లక్షలు ఖర్చుచేశానని.. తన వద్ద రూ.10 లక్షలే ఉన్నట్లు చెప్పినట్లుగా వినుత దంపతులు పోలీసులకు చెప్పారు. డ్రైవర్ శ్రీనివాస్ తో మాట్లాడే సమయంలో మాటా మాటా పెరిగిందని.. పరిస్థితి చేయి దాటినట్లుగా పోలీసులకు చెప్పారు. బ్లాక్ మొయిలింగ్ బాధితులమైన తాము హత్య కేసులో చిక్కుకున్నామని.. తమ రాజకీయ జీవితాన్నినాశనం చేయాలన్న ఎమ్మెల్యే బొజ్జల తమ పంతాన్ని నెగ్గించుకున్నట్లుగా పేర్కొన్నారు.
 
మొత్తంగా డ్రైవర్ శ్రీనివాస్ హత్య ఉదంతాన్ని ఒప్పుకుంటూనే.. అందుకు దారి తీసిన పరిస్థితుల్ని చెన్నై పోలీసులకు వివరించటం ఒక ఎత్తు అయితే.. తమ పూర్వపు పార్టీ అధినేత తీరును తప్పు పట్టిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Tags
janasena ex leader vinutha kota chennai police murder case arrested
Recent Comments
Leave a Comment

Related News