ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బుధవారం చాలా బిజీ బిజీగా గడిపారు. క్షణం తీరిక లేకుండా.. ఏపీ వ్యవహారాలపై ఆయన కేంద్ర మంత్రులతో వరుస భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులు, ఆర్థిక సమస్యలను చర్చించారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటోందని ఆయన చెప్పారు. ఈ క్రమంలో మరింత సాయం చేయాలని కేంద్ర మంత్రులకు సూచించారు. తొలుత కేంద్ర ఆర్థిక ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతికి ఇచ్చిన 1500 కోట్ల రూపా యల గ్రాంటుపై కృతజ్ఞతలు తెలిపారు. అయితే.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా పరిగణించి.. మరిన్ని నిధులు ఇవ్వాలని ఆయన కోరారు.
ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయించేలా చూడాలన్నారు. అయితే.. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ నిర్ణ యం తీసుకోవాల్సి ఉంటుందని.. తర్వాత.. నిధులపై చర్చించాలని కేంద్ర మంత్రి సూచించారు. వెనుకబడిన జిల్లాలకు కేటాయిం చిన నిధులను సత్వరమే విడుదల చేయాలని ఆమెకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అలాగే.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాయోజిత పథకాలను తాము 78 అమలు చేస్తున్నామని.. వాటికి సత్వరమే రెండో విడత నిధులను మంజూరు చేయాలని చంద్రబాబు విన్నవించారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు. ఇప్పటి వరకు ఇచ్చిన నిధులకు సంబంధించిన ఖర్చు వివరాలను తమకు సమర్పిస్తే.. తప్పకుండా.. తదుపరి విడత నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం.. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో నిర్మించనున్న క్రీడా మైదానాలకు సంబంధించిన వివరాలను ఆయన ముందు ఉంచారు. అదేవిధంగా ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించ నున్న స్పోర్ట్స్ సిటీ(క్రీడా నగరం) ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని.. దీనికి అనుమతులు ఇవ్వడంతోపాటు.. కేంద్రం నిధులు ఇచ్చేలా సహకరించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీని అమలు చేస్తున్నామని.. దీనికి కూడా సహకారం అందించాలన్నారు. తదుపరి జరగబోయే ఒలింపిక్స్‌కు ఏపీని వేదిక చేయా లని నిర్ణయించుకున్నామని.. దీనికి సంబంధించిన విధివిధానాలను తమకు ఇవ్వాలని చంద్రబాబు కోరారు.
అనంతరం.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం నిర్వహించిన సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను.. ముఖ్యంగా కొత్తగా నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు వివరాలను కూడా కేంద్రానికి అందించారు దీనికి సుమారు 81 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని.. ఈ మొత్తాన్ని కేంద్రమే భరించేలా చూడా లని విన్నవించారు. అయితే..త ఎలంగాణ ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని వృథాగా పోతున్న జలాలను మాత్రమే తాము వినియోగించుకుంటున్నామని బలంగా తేల్చి చెప్పారు. దీనిపై కమిటీ వేయాలని నిర్ణయించారు.