మంచు ఫ్యామిలీలో ఇటీవల చోటు చేసుకున్న విభేదాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచు విష్ణు, మంచు మనోజ్ ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితికి వచ్చి కోర్టులు, కేసులు అంటూ మోహన్ బాబు ఇంటి పరువును బజారుకు ఈడ్చారు. అయితే ఇంత జరిగినా కూడా మంచు లక్ష్మి మాత్రం పెద్దగా రియాక్ట్ కాలేదు. ముంబైకే పరిమితం అయ్యింది. అయితే తాజాగా కుటుంబ గొడవలపై సైలెన్స్ ను మంచు లక్ష్మి బ్రేక్ చేసింది. తన మౌనం వెనుక రీజనేంటో బయటపెట్టింది.
ప్రస్తుతం మంచు లక్ష్మి త్వరలో విడుదల కాబోయే తన `దక్ష` ఫిల్మ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కుటుంబ గొడవలపై నోరు ఊపింది. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. `ఒక ఫ్యామిలీలో సమస్యలు ఉంటే మొత్తం అందరూ బాధపడతారు. మేము ఉండేది అద్దాల మేడలో.. ఏం మాట్లాడిన తల, తోక కట్ చేసి ఎవరికి నచ్చినట్లు వారు రాసుకుని ప్రచారం చేస్తారు.
అలాంటప్పుడు సైలెంట్ గా ఉండటమే బెటర్ అని నాకు అనిపించింది. ఒకప్పుడు ఏది తప్పు, ఏది ఒప్పు అని ఆలోచించే దాన్ని. కానీ ఇప్పుడు పరిస్థితులను తట్టుకొని ప్రశాంతంగా ఉండటమే ముఖ్యం అనిపిస్తుంది. జీవితంలో ఏదైనా మనకు ఒక పాఠం నేర్పించడానికే వస్తుంది. ఏం జరిగినా మౌనంగా ఆలోచిస్తే ఆనందం, శాంతి లభిస్తుంది` అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.