ఓట్ చోరీ సహా.. ఇతర అంశాలను లేవనెత్తుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పేపర్లపై ఇక నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల ఫొటోలను కూడా ముద్రించనుంది. వాస్తవానికి ఇప్ప టి వరకు.. అభ్యర్థి పేరు, పార్టీ ఎన్నికల గుర్తును మాత్రమే బ్యాలెట్‌పై ముద్రిస్తున్నారు. అదేసమయంలో బ్లాక్ అండ్ వైట్‌లో అభ్య ర్థి ఫొటోలను కేవలం పార్లమెంటు ఎన్నికలకే పరిమితం చేస్తున్నారు. ఇక, నుంచి వీటిలో మార్పులు చేయాలని ఈసీ నిర్ణయిం చింది. తద్వారా.. ఓటర్లకు మరింత నాణ్యమైన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఈసీ తాజాగా వెలువరించిన ప్రకటన స్పష్టం చేసింది.
మార్పులు ఇవీ..
వాస్తవానికి బ్యాలెట్ పత్రాలపై ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదు. అయినప్పటికీ.. ఈవీఎంలపై బ్యాలెట్ పత్రం అంటిస్తారు. అంటే .. ఎవరెవరు పోటీలో ఉన్నారు? ఏ అభ్యర్థి ఏ పార్టీకి చెందిన నాయకుడు? అనే విషయాలు ఆ పత్రంపై ఉంటాయి. కొందరు సీరి యల్ నెంబరు ఆధారంగా కూడా ప్రచారం చేసుకుంటారు. ``నాకు ఫలానా నెంబరు కేటాయించారు. ఆ నెంబరుకు ఓటేయం డి.`` అని అభ్యర్థులు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు కొందరు అభ్యర్థుల ముఖాలను చూసి ఓటేస్తారు. మరికొంద రు పార్టీల గుర్తులను చూసి గుద్దేస్తారు. ఇలా.. ఓటర్లు.. తమకు అనుకూలంగా ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓటేస్తున్నారు. దీనిని గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది.
ఏం చేస్తారంటే..
+ ఈవీఎంలపై అంటించే బ్యాలెట్ పత్రాల సైజును పెంచనున్నారు.
+ బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల కలర్ ఫొటోలను బస్ట్ వరకు స్పష్టంగా ముద్రించనున్నారు.
+ అభ్యర్థులకు కేటాయించిన సీరియల్ నెంబరును 30 ఫాంట్‌లో ముద్రించనున్నారు.
+ పార్టీ గుర్తులు అస్పష్టంగా కాకుండా.. జాగ్రత్తలు తీసుకుంటారు.
+ అదేవిధంగా ముద్రిత ఓటును చూసే సమయం 5 సెకన్ల నుంచి 10 సెకన్లకు పెంచుతారు.
+ ఓటు వేసిన తర్వాత(బటన్ నొక్కాక) వచ్చే బీప్ సౌండ్‌ను మరింత పెంచనున్నారు.
+ తద్వారా తాము ఓటు వేసిందీ లేనిదీ ఓటరు తెలుసుకోవచ్చు.
+ ఇవన్నీ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే అమలు చేయనున్నారు.