ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఏడాది అక్టోబర్ 17న దుబాయ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో దుబాయ్ లోని ప్రవాసాంధ్రులు గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం నిర్వహించబోతున్నామని ఏపీఎన్నార్టీఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి కుమార్ వేమూరు చెప్పారు. 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం జరిగే వేదిక ఇంకా ఖరారు కాలేదని, వేదికతోపాటు రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలను ఏపీఎన్నార్టీఎస్ బృందం త్వరలోనే వెల్లడించనుందని తెలిపారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వివరాల కోసం ఎదురుచూస్తుండాలని ఆయన కోరారు. డాక్టర్ రవికుమార్ వేమూరు మార్గదర్శకత్వంలో, ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రాధాకృష్ణ రవి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు.