`మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` వంటి డీసెంట్ హిట్ అనంతరం సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క నుంచి వచ్చిన రీసెంట్ ఫిల్మ్ `ఘాటి`. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. విక్రమ్ ప్రభు, రమ్య కృష్ణ, చైతన్య రావు తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. గంజాయి అక్రమ రవాణా నేపథ్యంలో సాగే రివేంజ్ డ్రామా ఇది.
సెప్టెంబర్ 5న విడుదలైన ఘాటి అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే షీలావతి పాత్రలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్ గా ఈ సినిమా పరాజయం పాలైంది. డిజాస్టర్ టాక్ రావడం, పైగా పుష్ప మూవీతో కొన్ని పొలికలు ఉండటంతో ఘాటి వైపు ఆడియెన్స్ కన్నెత్తి చూడలేదు. దాంతో వారానికి థియేటర్స్ నుంచి లేపేశారు. రేపు మాపో ఓటీటీలోకి కూడా రావడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఘాటి మూవీకి ఫస్ట్ ఛాయిస్ అనుష్క కాదట. మొదట డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను లేడీ సూపర్ స్టార్ నయనతారతో చేయాలని భావించారట. ఆమెకు స్టోరీ నెరేషన్ ఇవ్వడం కూడా జరిగిందట. కానీ ఎందుకో అనుష్క ఘాటి చేసేందుకు ఆసక్తి చూపలేదు. సున్నితంగా స్టోరీని ఆమె రిజెక్ట్ చేసిందట. దాంతో క్రిష్ మరో ఆలోచన లేకుండా అనుష్కను సంప్రదించగా.. అప్పటికే `వేదం` లాంటి సూపర్ హిట్ ఇచ్చి ఉండటంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఘాటి వంటి ఫ్లాప్ నుండి నయన్ సేఫ్.. అనుష్క బలైపోయిందనే చెప్పుకోవచ్చు.