టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు ఎంత అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాను పవన్ కళ్యాణ్ భక్తుడిని అని బండ్ల గణేష్ ఎన్నో సార్లు చెప్పారు. అయితే కొంతకాలంగా పవన్ కు అనుకూలంగా బండ్ల గణేష్ వ్యాఖ్యలు గానీ సోషల్ మీడియాలో పోస్టులు కానీ చేయడం లేదు. అదే సమయంలో పేరు చెప్పకుండా ఎవరు అనే విషయాన్ని ప్రస్తావించకుండా పరోక్షంగా పవన్ ను టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓజీ చిత్రం విడుదలకు ఒక్క రోజు ముందు తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.
కొంతమంది నీకోసం ఎంత చేస్తున్నావో చూడరు.... నీవు చేయని వాటిని మాత్రమే చూస్తారు.... కృతజ్ఞతలు లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తి పరచలేవు... అంటూ బండ్ల గణేష్ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది. అయితే, అది పవన్ ను ఉద్దేశించి బండ్ల గణేష్ చేశారని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని, అందుకే పరోక్షంగా బండ్లన్న ఈ రకంగా ట్వీట్స్ వేస్తున్నాడని అంటున్నారు.
వీరిద్దరి మధ్య గ్యాప్ రావడానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణమని మరి కొందరు అంటున్నారు. ఒకవేళ వీరి మధ్య గ్యాప్ లేకుంటే ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ తప్పకుండా కనిపించే వారని చెబుతున్నారు. ఏది ఏమైనా తన దేవుడు పవన్ కళ్యాణ్ పై భక్తుడు బండ్ల గణేష్ పరోక్షంగా చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.